Android Based ATM: బ్యాంక్‌కు బై బై చెప్పండి.. ఆండ్రాయిడ్ ATM వచ్చేసింది..!
Android Based ATM: హిటాచీ దేశంలోనే మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఆధారిత క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ ATMని తయారు చేసింది. ఇది మొత్తం బ్యాంక్ లాగా పని చేయగలదు.
Android Based ATM: హిటాచీ పేమెంట్ సర్వీసెస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో దేశంలోనే మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఆధారిత క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ (CRM) ATMని తయారు చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత CRM గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2024 సందర్భంగా విడుదల చేశారు. ఇది సాధారణ ATM లాగా కాకుండా మొత్తం బ్యాంక్ లాగా పని చేయగలదు. ఆండ్రాయిడ్ ఆధారిత నగదు రీసైక్లింగ్ మెషీన్‌లో హోమ్ లోన్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, FDలో పెట్టుబడుల కోసం అప్లికేషన్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది త్వరలో అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
RBI ప్రకారం Android ఆధారిత CRM డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్‌గా పనిచేస్తుంది. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ అనేది ఇప్పటికే ఉన్న ఆర్థిక ఉత్పత్తులు, సేవలతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించే ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ పాయింట్ బిజినెస్ యూనిట్/హబ్. ఇది సెల్ఫ్ సర్వీస్ మోడ్‌లో రన్ అవుతుంది.
బ్యాంకింగ్ కస్టమర్లు ఈ ATM ద్వారా అనేక రకాల బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. QR-ఆధారిత UPI క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్, అకౌంట్ ఓపెన్, క్రెడిట్ కార్డ్ , వ్యక్తిగత రుణాలు, బీమా సేవలు, MSME లోన్‌లు, FASTag అప్లికేషన్, రీఛార్జ్ వంటి కొన్ని ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ ఆధారిత CRM భారతదేశంలో QR-ఆధారిత UPI క్యాష్ డిపాజిట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది వినియోగదారులు తమ సొంత లేదా ఇతర బ్యాంకు ఖాతాలలో నగదు రహిత డిపాజిట్లను 24 గంటలు చేయడానికి అనుమతిస్తుంది.ఆండ్రాయిడ్ ఆధారిత CRM మారుమూల ప్రాంతాల్లోని బ్యాంక్ సేవలను సులభంగా యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది.
ఒకే టచ్ పాయింట్ ద్వారా వివిధ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వారికి ఫిజికల్ కార్డ్ అవసరం లేనందున ఇది కస్టమర్‌ల భద్రతను కూడా పెంచుతుంది. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. హిటాచీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుమిల్ వికామ్సే మాట్లాడుతూ.. క్యాష్ బిజినెస్, హిటాచీ పేమెంట్ సర్వీసెస్, ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగంగా ఉంటుంది.
ఈ ఆవిష్కరణ భారతదేశం అంతటా బ్యాంకింగ్ సేవలను డిజిటలైజ్ చేయడంలో సెల్ఫ్ సర్వీస్‌ను మార్చడంలో యాక్సెస్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాంకింగ్ టచ్‌పాయింట్‌లు ఎకానమిక్ ఎంగేజ్‌మెంట్ అవసరమైన కేంద్రాలలోకి వస్తాయి.NPCI ప్రతినిధి సమగ్ర బ్యాంకింగ్ సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేయడం ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.
ఆండ్రాయిడ్ ఆధారిత CRM ద్వారా UPI ఆధారిత క్యాష్ విత్‌డ్రా, డాపిజిట్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను స్వీకరించడాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఏటీఎం చానెళ్ల వృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న 2,64,000 ATMలు/CRMలలో 76,000కు పైగా హిటాచీ నిర్వహిస్తోంది.