Zomato: జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుంటారా.? మీకోసమే ఈ గుడ్‌ న్యూస్

ఇక వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న జొమాటో తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Update: 2024-08-28 06:19 GMT

Zomato: జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుంటారా.? మీకోసమే ఈ గుడ్‌ న్యూస్ 

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ చిన్న అకేషన్‌ వచ్చినా చాలు వెంటనే జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసే రోజులు వచ్చేశాయ్‌. క్షణాల్లో ఇంటి వద్దకే ఫుడ్‌ వస్తుండడంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రారంభంలో కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన జొమాటో సేవలు ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించారు.

ఇక వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న జొమాటో తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా ఫీచర్‌.? దాని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పలాన టైమ్‌కి ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలని అనుకుంటాం. అయితే అదే సమయంలో ఏదైనా అర్జెంట్‌ వర్క్‌ ఉండడం, లేదా ప్రయాణంలో ఉండడం వల్లే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అలాకాకుండా ముందుగానే ఫుడ్‌ ఆర్డర్‌ను షెడ్యూల్‌ చేసుకుంటే భలే ఉంటుంది కదూ!

ఇందుకోసమే జొమాటోలో ఆర్డర్‌ షెడ్యూలింగ్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ సహాయంతో వినియోగదారులు రెండు రోజుల ముందే భోజనాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫుడ్‌ను ముందుగా బుక్‌ చేసుకోవడం వల్ల మెరుగైన నాణ్యతను పొందొచ్చని జొమాటో నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా బల్క్‌ ఆర్డర్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జొమాటో సీఈవో, వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసిన గోయల్‌.. ఆర్డర్‌ షెడ్యూలింగ్ ఫీచర్‌ను తొలుత.. ఢిల్లీ ఎన్ సీఆర్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, జైపూర్‌ నగరాల్లో తొలుత అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. 13 వేల రెస్టారెంట్ల నుంచి నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్‌ కేవలం రూ. 1000 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. త్వరలోనే దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఈ ఫీచర్‌ను తీసుకొస్తామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News