YouTube Tips: యూట్యూబ్‌లో ఫాలోవర్లు పెరగడం లేదా.. ఈ పద్దతులు పాటించండి..!
YouTube Tips: యూట్యూబ్ నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్. ఇక్కడ మిలియన్ల మంది వ్యక్తులు తమ వీడియోలను అప్‌లోడ్ చేస్తారు.
YouTube Tips: యూట్యూబ్ నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్. ఇక్కడ మిలియన్ల మంది వ్యక్తులు తమ వీడియోలను అప్‌లోడ్ చేస్తారు. మిలియన్ల మంది వ్యక్తులు ఈ వీడియోలను చూస్తారు. చాలా మంది యూట్యూబర్‌లుగా మారడం ద్వారా బాగా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా చాలా ఫేమస్ అవుతున్నారు. మీరు యూట్యూబ్‌లో మీ కెరీర్‌ని మొదలుపెట్టాలంటే ఫాలోయర్‌లను త్వరగా పెంచుకోవాలంటే కొన్ని పద్దతులను పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ప్రతిరోజు పోస్టులు
యూట్యూబ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఛానెల్‌లో ప్రతిరోజు వీడియోలను అప్‌లోడ్ చేయాలి. ప్రతి విషయంలో అప్‌డేట్‌గా ఉండాలి. కొత్త కంటెంట్‌ని అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఫాలోవర్లు పెరిగిపోతారు. కనీసం వారానికి మూడు వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
కంటెంట్ క్వాలిటీపై శ్రద్ధ వహించాలి
యూట్యూబ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి మీ వీడియోల్లో కొత్తదనాన్ని చూపించాలి. ఇది ఫాలోవర్లను ఆకర్షిస్తుంది. మీ ఛానెల్‌కి కొత్త వీక్షకులను తీసుకువస్తుంది.
షార్ట్ వీడియోలు షేర్ చేయాలి
యూట్యూబ్‌లో తొందరగా ఫాలోవర్లను సంపాదించాలంటే రోజువారీ షార్ట్ వీడియోలను పోస్ట్ చేయాలి. షార్ట్‌లు అంటే 60 సెకన్ల కంటే తక్కువ నిడివి ఉన్న చిన్న వీడియోలు. వీటిని ఎక్కువగా మొబైల్‌లో వీక్షిస్తారు. ఈ రోజుల్లో ఇవి మరింత జనాదరణ పొందుతున్నాయి.
థంబ్‌నెయిల్ అట్రాక్ట్‌గా ఉండాలి
యూట్యూబ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లను పొందాలంటే మంచి థంబ్‌నెయిల్ పెట్టాలి. దీనిని చూసే చాలామంది వీడియోలను ఓపెన్ చేస్తారు. కాబట్టి దీనిని కచ్చితంగా అట్రాక్ట్‌గా తీర్చిదిద్దాలి. అందరికంటే భిన్నంగా ఉండాలి. అలాగే థంబ్‌నెయిల్‌లో ఉన్న విషయాన్ని అర్థమయ్యేగా వివరించాలి. ఇలా చేయడం వల్ల తొందరలోనే చాలా ఫాలోవర్లను సంపాదిస్తారు.