Smartwatch: ఇదొక మాయా గడియారం.. స్మార్ట్‌ఫోన్‌ అవసరం ఉండదు ధర కూడా 2వేల లోపే..!

Smartwatch: ఫైర్-బోల్ట్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్‌ వచ్చేసింది.

Update: 2023-01-28 11:30 GMT

Smartwatch: ఇదొక మాయా గడియారం.. స్మార్ట్‌ఫోన్‌ అవసరం ఉండదు ధర కూడా 2వేల లోపే..!

Smartwatch: ఫైర్-బోల్ట్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్‌ వచ్చేసింది. దీనికి Fire-Boltt Talk Ultra అని పేరు పెట్టారు. ఈ వాచ్ బ్లూటూత్ సపోర్ట్‌తో వస్తుంది. హెల్త్ ట్రాకింగ్, IP68 రేటింగ్‌తో వస్తుంది. గడియారం గుండ్రంగా ఉంటుంది. అద్భుతమైన ఫీచర్‌లను కలిగి ఉంది. ఫైర్-బోల్ట్ టాక్ అల్ట్రా ధర, ఫీచర్ల గురించి ఓ లుక్కేద్దాం.

స్పెసిఫికేషన్స్

ఫైర్-బోల్ట్ టాక్ అల్ట్రాలో 1.39-అంగుళాల LCD డిస్ప్లే ఉంటుంది. దీని బరువు 80 గ్రాములు మాత్రమే. స్క్రీన్ 240 × 240 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది మైక్రోఫోన్ స్పీకర్‌ను కలిగి ఉంటుంది. దీని సహాయంతో కాల్‌లను స్వీకరించవచ్చు లేదా చేసుకోవచ్చు.

వాచ్ వాయిస్‌పై కూడా పని చేస్తుంది. ఇందులో రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి 123 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్‌ల గురించి చెప్పాలంటే SpO2 మానిటరింగ్, డైనమిక్ హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ ఉన్నాయి. గడియారం నీటిలో లేదా దుమ్ములో పాడైపోదు.

ఫైర్-బోల్ట్ టాక్ అల్ట్రా ధర

వాచ్‌లో అద్భుతమైన బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏడు రోజులు వస్తుంది. అదే సమయంలో వాచ్ 120 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. భారతదేశంలో ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1,999. వాచ్ 6 రంగులలో వస్తుంది. నలుపు, నీలం, ఎరుపు, గ్రే, పింక్ వంటి రంగులలో కొనుగోలుకి సిద్దమవుతుంది.

Tags:    

Similar News