త్వ‌ర‌లో రానున్న ఫేస్ బుక్ స్మార్ట్ వాచ్! ఫోటోలు, వీడియోలు తీయోచ్చంట!

Facebook Smartwatch: ఫేస్‌బుక్ నుంచి త్వరలో ఓ స్మార్ట్‌వాచ్ రానుంది.

Update: 2021-06-10 13:00 GMT

ఫేస్‌బుక్ స్మార్ట్‌వాచ్ (ఫొటో ట్విట్టర్)

Facebook Smartwatch: ఫేస్‌బుక్ నుంచి త్వరలో ఓ స్మార్ట్‌వాచ్ రానుంది. ప్రస్తుతం మన స్మార్ట్‌ఫోన్‌లానే ఈ స్మార్ట్‌వాచ్‌ను కూడా వినియోగించుకునేలా తయారుచేస్తున్నారంట. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

పల్స్‌రేట్‌ తోపాటు, రెండు కెమెరాలు, ఫిట్‌నెస్ కంపెనీల సేవలు లేదా హార్డ్‌వేర్‌లకు కూడా కనెక్ట్ కావచ్చని తెలుస్తోంది. మరో విషేశం ఏంటంటే.. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఈ స్మార్ట్‌వాచ్‌ను ఆపరేట్ చేయగలగడం. ఈమేరకు అమెరికా టెక్నాలజీ సైట్ ది వెర్జ్ ఓ కథనంలో వెల్లడించింది. వీటితో పాటు సెకండ్‌, థర్డ్‌ జెనరేషన్‌ వాచ్‌లను కూడా లాంచ్‌ చేయనున్నట్లు పేర్కొంది. దీని సుమారు 400 డాలర్లు (సుమారు రూ .29,000) గా ఉండబోతోందని వెల్లడించింది.

ఈ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. మెసేజెస్‌ను పంప‌డంతో పాటు హెల్త్‌, ఫిట్‌నెస్ లను కూడా తెలుసుకోవచ్చంట. స్మార్ట్‌వాచ్‌లో రెండు కెమెరాల డిస్‌ప్లేతో రానుందంట. వీటితో ఫోటోల్ని, వీడియోల్ని కూడా తీయవచ్చంట. అలా క్యాప్చ‌ర్ చేసిన వీడియోల్ని ఇన్‌స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా షేర్ చేసే ఆప్షన్‌ కూడా ఉందంట. అలాగే ముందుక భాగంలో ఉన్న కెమెరాతో వీడియో కాలింగ్ చేసుకోవ‌చ్చ‌ని వెర్జ్ పేర్కొంది. వెనుక భాగంలో పూర్తి హెచ్ డీతో డీజికామ్ ఉంటుందంట.

అయితే, ఫోన్‌తో అవసరం లేకుండా స్మార్ట్ వాచ్ కు ఎల్‌టిఇ కనెక్టివిటీని జోడించాలని సోషల్ మీడియా దిగ్గజం ప్రయత్నాలు చేస్తుందంట. స్మార్ట్‌వాచ్‌ సెగ్మెంట్‌లో వినియోగదారును ఆకట్టుకున్న ఆపిల్, హువావే, గూగుల్‌లకు గట్టి పోటీ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ స్మార్ట్‌వాచ్‌ను త్వరగా తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారంట. 

Tags:    

Similar News