Refrigerator Care: వర్షాకాలంలో ఫ్రిజ్ నుంచి వింత వాసన వస్తుందా..!
Refrigerator Care: వర్షాకాలం దాని నుంచి చెడ్డ వాసన వచ్చినప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
Refrigerator Care: వర్షాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా జాగ్రత్తగా గమనించాలి. ఎయిర్ కండీషనర్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్ల పనితీరుని పరిశీలించాలి. వీటిని సరిగ్గా మెయింటనెన్స్ చేయకపోతే వాటి జీవిత కాలం తగ్గుతుంది. కిచెన్‌లోని ముఖ్యమైన వస్తువులలో ఒకటైన రిఫ్రిజిరేటర్ విషయంలో కొన్ని తప్పులు చేయకూడదు. వర్షాకాలం దాని నుంచి చెడ్డ వాసన వచ్చినప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఫ్రిజ్‌ని జాగ్రత్తగా వాడాలి
వర్షాకాలంలో రిఫ్రిజిరేటర్ శత్రువు అధిక తేమ అలాగే దాని నుంచి వచ్చే బ్యాక్టీరియా. తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రిజ్‌లో నుంచి వింతైన వాసన వస్తుంది. దీంతో క్రిముల సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఫ్రిజ్ క్లీనింగ్‌పై జాగ్రత్త వహించాలి.
ఫ్రిజ్ శుభ్రపరచాలి
వర్షాకాలంలో రిఫ్రిజిరేటర్ డోర్ సీల్‌లో గ్యాప్ లేదా పగుళ్లు లేకుండా చూసుకోవాలి. అలాగే ఫ్రిజ్ తలుపును ఎక్కువసేపు తెరిచి ఉంచకుండా చూడాలి. ప్రతి 4 నుంచి 6 రోజులకు ఒకసారి ఫ్రిజ్‌ని చెక్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఫ్రిజ్ ఎల్లప్పుడు శుభ్రంగా ఉంటుంది.
వేడినీటి వాడకం
వర్షాకాలంలో ఫ్రిజ్‌ను వేడినీటితో శుభ్రం చేయాలి. ఇందుకోసం ఫ్రిజ్‌లోని అన్ని షెల్ఫ్‌లను బయటకు తీసి గోరువెచ్చని నీరు, సబ్బు ఉపయోగించి పూర్తిగా శుభ్రం చేయాలి. దీనివల్ల ఫ్రిజ్‌లోని మురికి, బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.