Cheapest Cab and Food Delivery App: అయిపాయె.. ఇక్కడ తక్కువ ధరకే క్యాబ్, ఫుడ్.. ఆ యాప్స్‌తో ఆడుకోండి..!

Cheapest Cab and Food Delivery App: క్యాబ్ కంపేర్, Craveo యాప్స్ ద్వారా తక్కువ ధరకే క్యాబ్, ఫుడ్ బుక్ చేసుకోవచ్చు.

Update: 2024-08-31 09:46 GMT

Cheapest Cab and Food Delivery App

Cheapest Cab and Food Delivery App: మీరు కూడా ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నారా? మీరు ఆహారం, ప్రయాణాల కోసం ప్రతి నెల చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారా? అవును అయితే ఈ కథనం మీ కోసం మాత్రమే. ఈరోజు మనం అలాంటి కొన్ని యాప్‌ల గురించి తెలుసుకుందాం. వాటి సహాయంతో మీరు తక్కువ ధరకే ఫుడ్, క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు. ప్రతి నెలా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఈ యాప్‌లు ఎలా పని చేస్తాయి, అవి మీకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయి. తదితర వివరాలను తెలుసుకుందాం.

నిజానికి ఇటీవల ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అద్భుతమైన పోస్ట్‌ను షేర్ చేసారు. దీనిలో మీరు యాప్ ద్వారా చీప్‌గా క్యాబ్‌ను ఎలా బుక్ చేసుకోవచ్చో చెప్పారు. విశేషమేమిటంటే ఈ యాప్ పూర్తిగా ఉచితం, మీరు దీన్ని ప్లే స్టోర్‌లో చూడవచ్చు. ఈ యాప్ పేరు క్యాబ్ కంపేర్. ఇక్కడ నుండి మీరు ఒక యాప్‌లో Ola, Uber, Rapido ధరలను చెక్ చేయవచ్చు. వీటి ఆధారంగా మీకు దొరికిన చౌకైన క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఈ యాప్ మీకు ఒకే చోట మొత్తం సమాచారాన్ని అందిస్తోంది. మీరు వేర్వేరు యాప్‌ల మధ్య మళ్లీ మళ్లీ మారాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌ ప్లే స్టోర్‌లో 5 లక్షల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. చాలా మంది వనియోగదారులు దీనికి పాసిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అదే సమయంలో కంపెనీ ప్రైవసీకి సంబంధించి అనేక సేఫ్టీ ఫీచర్లను ఇందులో యాడ్ చేసింది.

మీరు ప్రతిరోజూ లేదా అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే మీరు ఇప్పుడే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ పేరు Craveo- Compare Food Delivery. ఈ యాప్ కూడా ‘క్యాబ్ కంపేర్’ యాప్ లాగా పనిచేస్తుంది. ఇందులో మీ Zomato లేదా Swiggy అకౌంట్‌లను అటాచ్ చేయడం ద్వారా తక్కువ ధరలో ఆహారం ఎక్కడ లభిస్తుందో మీరు నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లు ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ప్రైవసీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Tags:    

Similar News