BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి చౌకైన ప్లాన్‌.. రూ.107లకే 35 రోజుల వ్యాలిడిటీ..జియో, ఎయిర్‌టెల్‌కు ఇచ్చి పడేసిందిగా..

BSNL రూ. 107ల ప్లాన్ 35 రోజులపాటు 3GB డేటా అందించనుంది.

Update: 2024-09-11 11:18 GMT

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి చౌకైన ప్లాన్‌.. రూ.107లకే 35 రోజుల వ్యాలిడిటీ..జియో, ఎయిర్‌టెల్‌కు ఇచ్చి పడేసిందిగా..

BSNL Cheapest Recharge Plan: చౌకైన ప్లాన్‌లతో కస్టమర్‌లను ఆకర్షించేందుకు ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వరంగ సంస్థం బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా పోటీపడుతోంది. ఈ క్రమంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 20, 28, 30 రోజుల వ్యాలిడిటీ బదులుగా 35 రోజుల వ్యాలిడిటీని అందించే ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్ రూ.107లకే అందించడం గమనార్హం. ఇది 35 రోజులపాలు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

BSNL రూ. 107ల ప్లాన్ 35 రోజులపాటు 3GB డేటా అందించనుంది. ఈ చౌకైన ప్లాన్‌‌లో 3 జీబీ డేటా పరిమితి ముగిసిన తర్వాత స్పీడ్ 40kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్‌తోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్ కూడా అందించనుంది.

చౌక ధరలతోనే సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచే ప్లాన్ కోసం ఎదురు చూస్తోన్న వారికోసం ఈ ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. తక్కువ డేటాతో చౌక ప్లాన్‌ కోసం ఎదురుచూస్తోన్న వారికోసం ఇది ఎంతో అద్భుతమైన ప్లాన్.

Tags:    

Similar News