iPhone 14 Massive Discount: బ్లాక్ బస్టర్ డీల్.. ఐఫోన్‌పై రూ.11 వేల డిస్కౌంట్..!

iPhone 14 Massive Discount: ఐఫోన్ 14పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించాయి. రూ.11 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-09-06 09:37 GMT

iPhone 14 Massive Discount

iPhone 14 Massive Discount: ఆపిల్ లవర్స్ ఐఫోన్ 16 సిరీస్ కోసం ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్లు సెప్టెంబర్ 9న మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ పాత మోడళ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. కంపెనీ చాలా తక్కువ ధరకు ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. రూ.11 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ అనేది ఈ కామర్స్ సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iPhone 14 మొబైల్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.79,900. అయితే ఐఫోన్ 15 లాంచ్ తర్వాత కంపెనీ ఐఫోన్ 14 ధరను రూ.10,300 తగ్గించి రూ.69,600కి విక్రయించింది. ఇప్పుడు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11,991 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఆ తర్వాత దాని కొత్త ధర రూ. 57,999గా మారింది. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై రూ.9,090 తగ్గింపు పొందిన తరువాత, దీని ధర రూ.60,900. రెండు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీరు మరింత తక్కువ ధరకు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 14 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 12MP + 12MP రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఐఫోన్ 14 పనితీరును పెంచడానికి, కంపెనీ A15 బయోనిక్ చిప్‌ని ఉపయోగించింది. ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉంది.

దీనితో పాటు క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS శాటిలైట్ కనెక్టివిటీ వంటి భద్రతా ఫీచర్లు కూడా iPhone 14లో అందించబడ్డాయి. దీనితో పాటు ఐఫోన్ 14 సిరీస్ యుఎస్ మోడల్‌‌లో సిమ్ ట్రే కూడా ఉండదు. Apple ఉపగ్రహ కనెక్టివిటీ ద్వారా అత్యవసర SOSని తీసుకువస్తోంది. కానీ ఇది USలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు బ్లాక్, పర్పెల్, స్కై బ్లూ, రెడ్ కలర్స్‌లో iPhone 14ని కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News