Airbags: దేశంలో ఈ 5 చౌకైన కార్లకి 6 ఎయిర్‌బ్యాగ్‌లు..!

Airbags: భారతీయ కస్టమర్లు తక్కువ ధరలో విలువైన ఫీచర్లను కోరుకుంటారు...

Update: 2022-04-11 07:05 GMT

Airbags: దేశంలో ఈ 5 చౌకైన కార్లకి 6 ఎయిర్‌బ్యాగ్‌లు..!

Airbags: భారతీయ కస్టమర్లు తక్కువ ధరలో విలువైన ఫీచర్లను కోరుకుంటారు. ఇప్పుడు అందరి దృష్టి కార్ల ఎయిర్ బ్యాగ్‌లపై పడింది. వినియోగదారులని ఆకట్టుకోవడానికి కంపెనీలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో 7-సీటర్ కార్లకు 3 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి. ఇటీవల 8-సీటర్ కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేశారు. అయితే కొన్ని కంపెనీలు ఇప్పుడు 5-సీటర్, 7-సీటర్ కార్లకి 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం ప్రారంభించాయి. అలాంటి 5 చౌకైన కార్ల గురించి తెలుసుకుందాం.

మారుతీ సుజుకి బాలెనో

మారుతీ సుజుకి భారతీయ కస్టమర్లకు ఇష్టమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. 2022 బాలెనోను ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.35 లక్షలతో విడుదల చేసింది. ఈ కారు టాప్ మోడల్ ధర రూ.9.49 లక్షలకు చేరుకుంది. మారుతి సుజుకి కొత్త కారుకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 20కి పైగా సేఫ్టీ ఫీచర్లను అందించింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.09 లక్షలు. ఇది ప్రస్తుతం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో దేశంలోనే అత్యంత సరసమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్.

కియా కేరెన్స్ 7-సీటర్

Kia Carens అనేది 7-సీటర్ MPV. ఇది భారతదేశానికి వచ్చిన వెంటనే కస్టమర్ల హృదయాలను కొల్లగొట్టింది. 8.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో 3-వరుసల కార్లని కంపెనీ విడుదల చేసింది. సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, HAV, VSM, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, BAS, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు వంటి ఫీచర్లు ఇచ్చారు.

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ i20 Astaలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.48 లక్షలు. టాప్ మోడల్ కోసం ఈ ధర రూ. 10.83 లక్షలకు చేరుకుంది. హ్యుందాయ్ i20 మూడు ఇంజన్ ఎంపికలతో అందిస్తున్నారు. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 83PS పవర్, 1.5-లీటర్ డీజిల్ 100PS పవర్, 120PS పవర్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి.

హ్యుందాయ్ i20 n లైన్

ఈ కారు నిజంగా బలమైన పనితీరు కోసం నిర్మించబడిన స్టాండర్డ్ i20 ఆధారంగా రూపొందించారు. దీంతో పాటు i20 భద్రతా లక్షణాలు ఇచ్చారు. ఇందులో టాప్ మోడల్ N8తో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చారు. ఈ శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ సాధారణ 1.0-లీటర్ TGDI టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను 6-స్పీడ్ IMT, 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో జత చేసింది. i20తో పోలిస్తే N లైన్ వెర్షన్ పూర్తిగా నలుపు రంగు ఇంటీరియర్‌తో వస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ

ఈ చిన్న సైజు ఎస్‌యూవీకి కస్టమర్లు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ టాప్ మోడల్ SX ఐచ్ఛికంతో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించింది. ఇది కాకుండా ఈ కాంపాక్ట్ SUVలో ABS విత్ EBD, ESC, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ కెమెరా, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News