IPL 2025 : కెప్టెన్ మారిన మారని ముంబై ఇండియన్స్ అదృష్టం..గత 13సీజన్లుగా అదే పరిస్థితి

IPL 2025 : ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ఈ జట్టుకు.. తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం మాత్రం అలవాటుగా మారింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. దీంతో గత 13 సీజన్లుగా తొలి మ్యాచ్‌లో ఓడిపోయే పరంపర కొనసాగుతోంది.
13 సీజన్లుగా అదే తంతు
2013 నుంచి ముంబై ఇండియన్స్ ఏ ఐపీఎల్ సీజన్‌లోనూ తొలి మ్యాచ్‌లో గెలవలేదు.చివరిసారిగా 2012లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ 13 సీజన్లలో ముంబై ఇండియన్స్ ముగ్గురు కెప్టెన్లను మార్చింది. అయినా ఫలితం మాత్రం మారలేదు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఉన్నా.. తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయారు.
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లైనప్ విఫలమైంది. చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ 4 వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర (65 నాటౌట్) రాణించడంతో చెన్నై విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (53) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ముంబై రికార్డ్
ఐపీఎల్‌లో అత్యధిక సీజన్లలో తొలి మ్యాచ్‌లో ఓడిన రికార్డు ముంబై పేరిట ఉంది. అయితే, తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా.. ఆ తర్వాత పుంజుకుని ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ముంబై ఇండియన్స్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, టోర్నమెంట్ ఇంకా చాలా మిగిలి