MS Dhoni: ధోనీ మాజీ లవర్ గురించి తెలుసా? ఈ అమ్మాయి క్రేజ్ మాములగా ఉండదు!
MS Dhoni: ధోనీ మాజీ ప్రేయసిగా రాయ్ లక్ష్మీ పేరు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమిళ చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్, అప్పట్లో ధోనీతో ఉన్న సంబంధం గురించి ఇప్పటికీ చర్చలో ఉండటాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. ఈ రిలేషన్ ఇప్పుడు ఒక ముద్రలా మారిందని ఆమె అభిప్రాయపడుతోంది.

MS Dhoni: ధోనీ మాజీ లవర్ గురించి తెలుసా? ఈ అమ్మాయి క్రేజ్ మాములగా ఉండదు!
MS Dhoni: భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ గతంలో ప్రేమలో పడిన వ్యక్తిగా పేరు పొందిన వ్యక్తి.. రాయ్ లక్ష్మీ. ఆమె పేరు ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. ధోనీ సీఏస్‌కే కెప్టెన్‌గానే కాదు, అప్పట్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆమెతో ఉన్న రిలేషన్ బాగానే హైలైట్ అయ్యింది. కానీ ఇది చాలా కాలం నిలవలేదు.
రాయ్ లక్ష్మీ బెంగళూరుకు చెందిన టాప్ మోడల్, నటిగా పేరుతెచ్చుకుంది. 2005లో తమిళ చిత్రం కర్కా కసదారాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఆమె పలు తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. 2008-09లో ధోనీతో ఉన్న సంబంధం వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ పార్టీలు, పర్సనల్ ఈవెంట్లలో ఇద్దరూ కలిసి కనిపించారు. రాయ్ లక్ష్మీ బర్త్‌డే పార్టీకి ధోనీ, రైనా కలిసి రావడం అప్పట్లో వార్తలకెక్కింది.
ఈ రిలేషన్ గురించి రాయ్ లక్ష్మీ కొన్నిసార్లు బహిరంగంగా మాట్లాడింది. ఆమె ధోనీని చక్కటి వ్యక్తిగా ప్రశంసించింది. అయితే ఆ తర్వాత కాలంలో ఇదంతా మచ్చలా మారిందని, ఎప్పుడైనా ధోనీ పాత విషయాలను తవ్వితే తమ రిలేషన్‌ను జోడించడం అలవాటైందని ఆమె వ్యాఖ్యానించింది. ఎన్నో సంవత్సరాలయ్యాక కూడా ఇదే చర్చలోకి రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పింది.
తనకు ధోనీతో రిలేషన్ తర్వాత కూడా మరో మూడు లేదా నాలుగు రిలేషన్లు వచ్చాయని రాయ్ లక్ష్మీ చెప్పినా, ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోలేదని ఆమె అభిప్రాయపడింది. ధోనీతో తన సంబంధం అనేది పెద్దగా నడవలేదని, అది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ముగిసిపోయిందని ఆమె స్పష్టంచేసింది. ధోనీ ప్రస్తుతం పెళ్లి చేసుకుని కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్నాడని, ఇద్దరిదీ స్పష్టమైన ముగింపు ఉన్న కథ అని రాయ్ లక్ష్మీ చెప్పిన మాటలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.