IPL 2021: కరోనా నియంత్రణకు వారి సేవ గొప్పది: మోరిస్
IPL 2021: ఈ విపత్కర సమయంలో ప్రజల జీవితాల్లో ఐపీఎల్ కాస్తయిన ఆనందాన్ని నింపగలదని క్రిస్ మోరిస్ అభిప్రాయం వ్యక్తం
IPL 2021: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. నిత్యం లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఓపైపు ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ విపత్కర సమయంలో ప్రజల జీవితాల్లో ఐపీఎల్ కాస్తయిన ఆనందాన్ని నింపగలదని రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
''భారతదేశంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోనే కొవిడ్ వ్యాప్తి ఎందుకు ఎక్కువగా ఉంటుందో అనే అంశంపై జట్టు సభ్యులందరం చర్చించుకొన్నాం. కరోనా నియంత్రణకు ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు 24 గంటలు కృషి చేస్తున్నారు. ఇది గొప్ప విషయం. ఒక జట్టుగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరి బాధ మాకు తెలుసు. బయట ఏం జరగుతుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది.
మా ముఖాల్లో చిరునవ్వుకు కారణమైన వారి కోసం ఆట.. వాళ్ల ముఖాల్లో కూడా చిరునవ్వు ఉండేలా చూడటం మా బాధ్యత'' అని మోరిస్ అన్నాడు. ''మేం గెలిచినా, ఓడినా మా ఆటను చూసిన ప్రజలకు అది కాస్తయిన ఉపశమనం ఇస్తే చాలు. కరోనా వారియర్స్‌కి, కొవిడ్ బాధితులకు రాజస్థాన్ రాయల్స్ అండగా ఉంటుంది'' అని క్రిస్ మోరిస్ పేర్కొన్నాడు.