Euro 2020 Final: యూరో 2020 ఫుట్ బాల్ కప్ విజేతగా ఇటలీ

Euro 2020 Final: పెనాల్టీ షైటౌట్ కు దారితీసిన ఈ మ్యాచ్ లో 3-2 తేడాతో ఇంగ్లండ్‌పై ఇట‌లీ విజ‌యం

Update: 2021-07-12 02:28 GMT

Uefa Euro 2020 Final:(Twitter)

Euro 2020 Final: యూరో 2020 ఫుట్‌బాల్ క‌ప్ విజేత‌గా ఇట‌లీ నిలిచింది. పెనాల్టీ షైటౌట్ కు దారితీసిన ఈ మ్యాచ్ లో 3-2 తేడాతో ఇంగ్లండ్‌పై ఇట‌లీ విజ‌యం సాధించింది. 1968 తర్వాత ఇటలీ అంటే(55 ఏళ్ల తర్వాత) ఇటలీ యూరోకప్ ను మరోసారి గెలుచుకుంది. లండన్ వేదికగా అభిమానులు కిక్కిరిసిన వెంబ్లే స్టేడియంలో అద్భుతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఆట అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ ఇక పెనాల్టీ షౌటౌట్ కు మారింది. ఇటలీ ఆరు అవకాశాల్లో మూడింటిని గోల్స్ చేయగా, ఇంగ్లాండ్ రెండింటిని మాత్రమే గోల్ గా మలిచింది. ఇక 67వ నిమిషంలో ఇటలీ ఆటగాడు లియానార్డో బోనుచి గోల్ చేసి స్కోరును సమయం చేశాడు. దీంతో ఆదిపత్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. .

2000, 2012లో ఇటలీ జట్టు ఫైనల్‌ చేరినా.. ఫైనల్ పోరులో నెగ్గ‌లేక‌పోయింది. 2018 ప్రపంచకప్‌కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక ఆ కసితో తరువాత ఆడిన మ్యాచుల్లో అపజయమే లేకుండా దూసుకెళ్లింది. 33 మ్యాచ్‌ల్లో ఇటలీ వరుసగా గెలుస్తూ వ‌చ్చింది. ప్రధాన టోర్నీల్లో ఇంగ్లండ్ పై ఇటలీదే పైచేయిగా నిలిచింది. ఇంగ్లండ్, ఇటలీ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ‌గా.. ఇటలీ 11, ఇంగ్లాండ్‌ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

Tags:    

Similar News