PBKS vs KKR: కలకత్తాతో పంజాబ్ కల నెరవేరేనా..!! కథగానే ముగిసేనా..!?

* నేడు దుబాయ్ వేదికగా కలకత్తా నైట్ రైడర్స్ - పంజాబ్ కింగ్స్ హోరాహోరి పోరు

Update: 2021-10-01 12:31 GMT

కలకత్తా నైట్ రైడర్స్ - పంజాబ్ కింగ్స్ (ఫైల్ ఫోటో)

PBKS vs KKR: ఐపీఎల్ 2021 శుక్రవారం ప్లేఆఫ్ లో బెర్త్ కోసం పోటీపడుతున్న జట్లలో కలకత్తా నైట్ రైడర్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 10 పాయింట్స్ తో నాలుగో స్థానంలో ఉన్న కలకత్తా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ రేసులో ముందుండాలనే పట్టుదల ఉంది. ఇప్పటికే బ్యాటింగ్ లో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ తో పాటు రాహుల్ త్రిపాటి మంచి ఫామ్ లో ఉండటంతో పాటు దినేష్ కార్తీక్, మోర్గాన్ బ్యాట్ ని ఝుళిపిస్తే భారీ స్కోర్ సాధించే అవకాశాలు లేకపోలేదు. బౌలింగ్ లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలంతో వికెట్లను పడగొట్టడంతో పాటు పేస్ లో ఫెర్గుసన్ తన సత్తా చాటుతున్నాడు.

ఇప్పటికే పంజాబ్ కింగ్స్ జట్టుపై సునీల్ నరైన్ కు 30 వికెట్లు పడగొట్టి మంచి బౌలింగ్ రికార్డు కూడా ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ జట్టులో బయో బాబుల్ కారణంగా ఐపీఎల్ కు క్రిస్ గేల్ దూరమవడం పంజాబ్ కింగ్స్ కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ కెప్టెన్ కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో కనబరచకపోవడం.., గాయంతో గత మ్యాచ్ కి దూరమైనా మయంక్ స్థానంలో మనిదీప్ జట్టులోకి వచ్చిన బ్యాటింగ్ లో విఫలమయ్యాడు.

తాజాగా పూర్తి ఫిట్ నెస్ సాధించడంతో మయంక్ అగర్వాల్ తిరిగి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఆడనున్నాడు. ఈరోజు కలకత్తా నైట్ రైడర్స్ జరగబోయే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడిపోతే ప్లేఆఫ్ ఆశలు దాదాపుగా ఆవిరి అయిపోయినట్లే. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరగబోతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకశాలున్నాయి.

ఇక ఇరుజట్ల విషయానికొస్తే..

కలకత్తా నైట్ రైడర్స్ జట్టు: శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (సి), నితీష్ రాణా, దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి

పంజాబ్ కింగ్స్ జట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

Tags:    

Similar News