Copa America : ఫైనల్ లో మెరిసిన మెస్సీ సేన..28 ఏళ్ళ తర్వాత ఛాంపియన్ గా

Copa America 2021: అర్జెంటీనా ఫుట్ బాల్ ప్రేమికుల 28 ఏళ్ళ నిరీక్షణకి ఎట్టకేలకు నేటితో తెరపడింది..

Update: 2021-07-11 08:43 GMT

అర్జెంటీనా ఫుట్ బాల్ టీం(ట్విట్టర్ ఫోటో) 

Copa America 2021: అర్జెంటీనా ఫుట్ బాల్ ప్రేమికుల 28 ఏళ్ళ నిరీక్షణకి ఎట్టకేలకు నేటితో తెరపడింది. చివరిసారిగా 1993లో కోపా అమెరికా కప్ ని గెలుచుకున్న అర్జెంటీనా శనివారం బ్రెజిల్ తో జరిగిన ఫైనల్ లో లియోనల్ మెస్సీ సారధ్యంలో కోపా కప్ ని గెలిచి అత్యధికంగా టైటిల్స్ గెలుచుకున్న టీంగా ఉరుగ్వేతో సమానంగా నిలిచింది. ఆదివారం ఉదయం మారాకానా స్టేడియంలో జరిగిన కోపా కప్ ఫైనల్ లో బ్రెజిల్ మరియు అర్జెంటీనా జట్లు తలపడ్డాయి. ఆట మొదలైన మొదటి ఇరవై నిమిషాల వరకు పోటాపోటిగా జరిగిన తర్వాత 22 వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఏజెల్‌ డీ మారియా మొదటి గోల్‌ చేసి అర్జెంటీనాకి బోణి చేశాడు.

మొదటి రౌండ్ లో ఒక గోల్ తో లీడ్ లో ఉన్న అర్జెంటీనా టీం పూర్తయ్యాక తర్వాత రౌండ్ లో బ్రెజిల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా 1-0 తో మెస్సీ సేన విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలుపుతో లియోనల్ మెస్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోగా, ఓటమి భారంతో బ్రెజిల్ ఆటగాడు శాంటోస్‌ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు. ఇక ఈ విజయంతో అర్జెంటీనా టీం 15 సార్లు కోపా అమెరికా కప్ నూ గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఇప్పటికి వరకు జరిగిన పలు మ్యాచ్ లలో ఎన్ని విజయాలను సాధించిన అర్జెంటీనాకి తాజాగా మెస్సీ సారధ్యంలో గెలిచిన కోపా అమెరికా కప్ చిరస్మరణీయంగా నిలవనుంది. ఈ గెలుపుతో అర్జెంటీనా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ మెస్సీని పొగడ్తలతో సోషల్ మీడియా వేదికగా ప్రశంశిస్తున్నారు.

Tags:    

Similar News