TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్..నేడు ఆర్జిత సేవల కోటా టికెట్ల విడుదల.!
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఇవాళ్టి నుంచి విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఇవాళ్టి నుంచి విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, అష్టదళపాద పద్మారాధన సేవల టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా నేటి నుంచి కేటాయించనుంది. దీనికి ఈ నెల 18 నుంచి ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల్లో తమ వివరాలను నమోదు చేసుకున్న భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా పలు ఆర్జిత సేవల టికెట్లను కేటాయించనుంది టీటీడీ.
ఎలక్ట్రానిక్ డిప్ లో ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం 12గంటల నుంచి 22వ తేదీన మధ్యాహ్నం 12గంటల వరకు నిర్దేశిత నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేయసుకోవాల్సి ఉంటుంది. ఇక కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకార సేవల్లో వర్చువల్ గా పాల్గొనే భక్తుల కోసం ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కోటా రిలీజ్ చేయనున్నారు.
ఇక అంగ ప్రదక్షిణం టికెట్లను 22వ తేదీ ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు. ఆరోజున మధ్యాహ్నం 3గంటలకు సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు స్పెషల్ దర్శనం కోసం టికెట్లను విడుదల చేయనుంది. రూ. 300ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 24న ఉదయం 10గంటలకు విడదల చేస్తారు. తిరుపతి, తిరుమలలో వసతి గదుల కోటాను 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కోటాను విడుదల చేస్తారు. ఈ టికెట్లను ఆన్ లైన్లో ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది టీటీడీ.