ఈరోజు "ప్రపంచ రక్త దాతల దినోత్సవం ". ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటారు.
మనిషి లో ఉన్న ABO రక్తం గ్రూప్ లను కనుగొని తద్వారా "రక్తం మార్పిడి "(BLOOD TRANSFUSION) ప్రక్రియ ను సులభతరంగా చేసి కొన్ని కోట్ల మంది తోటి మనుషుల ప్రాణాలు కాపాడిన నోబెల్ బహుమతి గ్రహీత... కార్ల్ లాండ్ స్టీనర్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది రక్తాన్ని దానం చేసి ప్రాణాపాయంలో వున్న వారిని కాపాడుతున్న
రక్తదాతలకు ధన్యవాదాలు తెలిపేందుకు, సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచే విధానాలను మెరుగు పరచుకునేందుకు 2005లో ఈ కార్యక్రమం ప్రారంభమయింది.
సమాజంలో ఇన్ని మార్పులు వచ్చినప్పటికీ కొంత మందికి రక్త దానం పైన అనేక అపోహలు ఉన్నాయి. రక్తం ప్రస్తుత పరిస్థితుల్లో కృత్రిమంగా తయారు చేయలేమని ఒక మనిషి మాత్రమే మరో మనిషి కి రక్తం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రక్తం నిధులు అన్ని బ్లడ్ బ్యాంకు లలో ఉండే వ్యవస్థ కొరకు ప్రజలు, ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలలో అవగాహన మరింత పెంచేందుకు కృషి చేయాలి.
కొన్ని విషయాలు తెలుసుకుందాం:
1)ప్రత్యేక రక్తం గ్రూప్ వారు తమ పేరును నమోదు చేసి అవసరమైన వారికి ఇవ్వండి.
2)ఎన్ని సార్లైనా రక్తం దానం చేయవచ్చు.
3) సాధారణంగా దాత నుంచి ఒకసారి రక్తం దానం చేసేటప్పుడు 350-400 m.l. వరకు తీసుకుంటారు. అంటే అది మన శరీరంలో మొత్తం రక్తం లో 10% కన్నా తక్కువ. కాబట్టి ఏ సమస్య రాదు.
4)17-65 సంవత్సరం వయసులోని వారు,బరువు 50కేజీల పైన ఉన్న వారు రక్తం దానం చేయవచ్చు.
5)B.p, sugar ఉన్న వారు,కాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని 5 సంవత్సరం దాటిన వారు రక్తం దానం చేయవచ్చు దానికి ఏ విధమైన సంబంధం లేదు.
6) సాధారణంగా ఒకసారి రక్తం దానం చేస్తే 2నెలల వరకు ఇవ్వరాదు
7) Hiv/ aids, హెపటైటిస్ B,C ఉన్న వారు; గర్భిణులు ఉన్న వారు రక్తం దానం చేయకూడదు
8) మలేరియా వ్యాధి సోకితే ఒక సంవత్సరం వరకు రక్తం దానం చేయకూడదు.
9)గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉన్న బ్లడ్ బ్యాంకు లలోనే రక్తం పాకెట్ లు అన్ని రకాల పరీక్షలు చేయబడుతాయి.బయట వారి నుంచి తీసుకోవద్దు.