చనిపోయిన తర్వాత బాడీని ఒంటరిగా ఉంచరు.. కారణం ఏంటో తెలుసా..?
Religion News: భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించాల్సిందే.
Religion News: భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అయితే మనిషి చనిపోయిన తర్వాత అతడి దహన సంస్కారాలు ఆచార సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. ఇందులో ఒక్కో మతం వారు ఒక్కో విధంగా జరుపుతారు. హిందూ మతంలో మృత దేహాన్ని అగ్నికి అంకితం చేసే సంప్రదాయం ఉంది. అంటే చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కాల్చివేస్తారు. దీంతో పాటు అంత్యక్రియలకు సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి. వాటిని కచ్చితంగా పాటించాలి. ఇవన్నీ గరుడ పురాణంలో స్పష్టంగా తెలియజేశారు.
ఒక వ్యక్తి సూర్యాస్తమయం తర్వాత మరణిస్తే అతని దహన సంస్కారాలు మరుసటి రోజు ఉదయం మాత్రమే జరుగుతాయి. ఈ సమయంలో మృతదేహాన్ని రాత్రంతా నేలపై ఉంచుతారు. ఎవరో ఒకరు ఖచ్చితంగా రాత్రంతా దానితో కూర్చుంటారు. గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత దహనం చేస్తే ఆ వ్యక్తి మోక్షాన్ని పొందలేడు. అందుకే దహన సంస్కారాలకు సరైన సమయాన్ని ఎంచుకోవడం అవసరం.
గరుడ పురాణం ప్రకారం మృతదేహాన్ని ఒంటరిగా వదిలినట్లయితే రాత్రి సమయంలో దుష్టాత్మ దానిలోకి ప్రవేశించి కొన్ని చెడు పనులు చేస్తోందట. అందుకే రాత్రిపూట ఎవరో ఒకరు ఖచ్చితంగా మృతదేహం దగ్గర కూర్చుని ఆ ప్రదేశం శుభ్రంగా ఉంచుతారు. అంతేకాకుండా ఏ దుష్టాత్మ మృతదేహంలోకి ప్రవేశించకుండా అక్కడ దీపం వెలిగిస్తారు.
హిందూమతం ప్రకారం మృత దేహం అంతిమ సంస్కారాలు మరణించిన వారి కుమారుడు లేదా కుమార్తె మాత్రమే నిర్వహిస్తారు. ఒకవేళ అతడి కుమారులు, కూతురులు దూరంగా ఉంటే వారు వచ్చే వరకు వేచి చూస్తారు. అంత్యక్రియలను అతడి కొడుకు ద్వారా జరిపిస్తారు. దీని వల్ల మరణించినవారి ఆత్మకు శాంతి లభిస్తుంది. లేకపోతే ఆత్మ పునర్జన్మ లేదా మోక్షం కోసం తిరుగుతూనే ఉంటుందని గరుడపురాణంలో చెప్పబడింది.