నటి అదితిరావు లగేజీ మిస్పింగ్ ఘటనపై నెటిజన్ల పోస్టులు... ఎయిర్‌పోర్టులో లగేజీ మిస్సైతే ఏం చేయాలి?

నటి అదితిరావు హైదరీ యూకే పర్యటన సమయంలో ఎయిర్‌పోర్టులో ఆమె లగేజీ మిస్సైంది.

Update: 2024-07-04 14:15 GMT

నటి అదితిరావు హైదరీ యూకే పర్యటన సమయంలో ఎయిర్‌పోర్టులో ఆమె లగేజీ మిస్సైంది. 45 గంటల తర్వాత అదితిరావు లగేజీని అధికారులు ఆమెకు అప్పగించారు. విమాన ప్రయాణికులకు లగేజీ కన్పించకుండా పోవడం ఇటీవలి కాలంలో మామూలై పోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. హీరోయిన్ అదితిరావు ఉదంతంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వరదలా వెల్లువెత్తాయి.

1. విమాన ప్రయాణంలో లగేజీ మిస్సయితే ఏం చేయాలి?

లగేజీ కోసం కనీసం అరగంట పాటు వేచి చూడాలి. అప్పటికి లగేజీ కన్పించకపోతే హెల్ప్ డెస్క్ వద్ద పీఐఆర్ సబ్మిట్ చేయాలి. లగేజీ బ్యాగులో ఉన్న వస్తువులకు సంబంధించి ఎయిర్ లైన్స్ వెబ్ సైట్ లో ఉన్న అంశాలు మీరు రాసిన ఫిర్యాదును సరిపోల్చుకోవాలి. ఈ ఫిర్యాదు కాపీని ప్రయాణికులు తమ వద్ద భద్రపర్చుకోవాలి. లగేజీ కన్పించకుండా పోయిందని ధ్రువీకరించిన తర్వాత ఎయిర్ లైన్స్ సిబ్బందికి మరో కొత్త ఫిర్యాదు ఇవ్వాలి. ఈ ఫిర్యాదులో లగేజీ బ్యాగులో ఉన్న వస్తువులు, వాటి ఖరీదు, వాటిని ఎప్పుడు కొనుగోలు చేశారనే అంశాలు పొందుపర్చాలి.


2. మీ వస్తువులు పాడైతే ఏం చేయాలి?

మీ బ్యాగేజి పాడైందని గుర్తిస్తే వెంటనే దాన్ని రిపేర్ చేసి తిరిగి ఇవ్వాలని ఎయిర్ లైన్స్ సంస్థను కోరాలి. ఇందుకు సంబంధించి హెల్ప్ డెస్క్ వద్ద దొరికే ఫారం నింపి ఇవ్వాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకొంటే లగేజీ మిస్సైన సందర్భంలో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాలకు వేర్వేరుగా ఇన్సూరెన్స్ ఉంటుంది. తమ అవసరాలకు అనుగుణంగా ప్రయాణీకులు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.

3. లగేజీ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

లగేజీ మిస్ కాకుండా ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. లగేజీ బ్యాగ్ పైన, లోపల రెండు ట్యాగ్ లు ఉండేలా చూసుకోవాలి. ఈ ట్యాగ్ లపై ప్రయాణీకుల చిరునామా, అడ్రస్, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. జీపీఎస్ తో అనుసంధానం చేసే ట్యాగ్ లను లగేజీలకు వేస్తున్నారు.

వీటి ద్వారా ప్రయాణికులు తమ ఫోన్ ద్వారా తమ లగేజీ ఎక్కడ ఉందో సులభంగా కనిపెట్టవచ్చు. లగేజీపై ఉన్న పాత లగేజీ స్టిక్కర్లను తీసివేయాలి. పాత లగేజీ స్టిక్కర్లుంటే ఎయిర్ పోర్టు సిబ్బంది పొరపాటుపడే అవకాశం ఉంటుంది.ఎయిర్ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకొంటే అన్ని క్లియరెన్స్ చేసుకొని విమానం ఎక్కేందుకు సిద్దంగా ఉండవచ్చు.


4. లగేజీ పోయిందని ఎన్ని రోజులకు నిర్ధారిస్తారు?

ప్రయాణికులు తమ లగేజీ పోయిందని ఎయిర్ లైన్స్ సంస్థకు ఫిర్యాదు చేసిన తర్వాత దాని కోసం వెతుకుతారు. అయితే 21 రోజుల వరకు లగేజీ దొరకకపోతే అప్పుడు లగేజీ పోయిందని ఎయిర్ లైన్స్ సంస్థ గుర్తిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల్లో 5 శాతం మంది తమ లగేజీ పోగోట్టుకుంటున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఏడాదికి కూడా లగేజీ దొరకకపోతే ఆ విమాన సంస్థపై కేసు పెట్టవచ్చు. అంతేకాదు ఎయిర్ లైన్స్ సంస్థ నుండి పరిహారం కోరవచ్చు.

మిస్సింగ్ కేసులు ఎక్కడ ఎక్కువ?

లగేజీ మిస్సైన సమయంలో ఎయిర్ లైన్స్ సంస్థల సిబ్బంది సరిగా రెస్పాండ్ అవడం లేదని కొందరు బాధితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జపాన్ లోని కాన్సాయ్ ఎయిర్ పోర్టులో 1994 సెప్టెంబర్ నుండి ఇప్పటివరకు లగేజీ కన్పించకుండా పోయిందనే ఫిర్యాదు రాలేదు. ఇక అమెరికాలోని జాన్ ఎఫ్ కెనెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లగేజీ మిస్ కావడం, పాడైన ఫిర్యాదులు ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి.

Tags:    

Similar News