Kuja Dosha: కుజ దోషం ఉంటే వివాహం జరగదా.. జ్యోతిష్యం ప్రకారం పరిష్కార మార్గం ఏంటంటే..?

Kuja Dosha: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతక ప్రభావం, పాప పుణ్యాలు, కర్మ ఫలితాలని బట్టి జీవితంలో కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Update: 2023-08-09 12:30 GMT

Kuja Dosha: కుజ దోషం ఉంటే వివాహం జరగదా.. జ్యోతిష్యం ప్రకారం పరిష్కార మార్గం ఏంటంటే..?

Kuja Dosha: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతక ప్రభావం, పాప పుణ్యాలు, కర్మ ఫలితాలని బట్టి జీవితంలో కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి కుజదోషం. ఈ జాతక వ్యక్తులకి వివాహం ఆలస్యమవుతుంది. ఎందుకంటే కుజగ్రహం చాలా ఉగ్ర గ్రహం. దీని ఎఫెక్ట్‌ మామూలుగా ఉండదు. కుజ దోషము స్టానాన్ని బట్టి వారి వయస్సును బట్టి దోష ప్రభావాలు భిన్నంగా ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం కుజ దోష జాతకులు ఎలాంటి పరిహారాలు చేయాలో ఈరోజు తెలుసుకుందాం.

కుజ దోషం అంటే ఏమిటీ..?

కుజ దోషమంటే ఒక వ్యక్తి జాతకచక్రములో 1, 2, 4, 7, 5, 12 స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి కుజదోషం ఉన్నట్లుగా చెబుతారు. ఇలాంటి వ్యక్తులు చిన్నపిల్లల మనస్తత్వం, కోపం ఎక్కువగా ఉండే లక్షణాలని కలిగి ఉంటారు. కుజ దోషము ఉన్న జాతకులకు వివాహ వయస్సు వచ్చినా వివాహము జరగదు. రోజు రోజుకి ఆలస్యము అవుతుంది. అంతేకాకుండా వివాహ సంబంధాలు కుదరినట్లే కుదిరి ఆఖరి నిముషాలలో చేజారిపోతాయి. దీనివల్ల జీవితంలో చాలా మానసిక క్షోభని అనుభవించాల్సి ఉంటుంది.

వివాహం అయ్యాక ఇబ్బందులు

కుజ దోషము ఉన్న జాతకులకి వివాహం అయినా కూడా వైవాహిక జీవితములో సమస్యలు ఏర్పడుతాయి. కుజుడు ఏడో స్థానము లేదా ఎనిమిదవ స్థానములో ఉన్నట్లయితే జీవితములో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విడాకులు, రెండు నుంచి మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉంటాయి. కుజుని ప్రభావం వల్ల కుటుంబములో అశాంతి నెలకొంటుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి.

కుజ దోషం పరిహారాలు

కుజ దోష ప్రభావాలు తొలగించుకోవడానికి ఉత్తమమైన మార్గము అమ్మ వారిని (దుర్గాదేవి) పూజించడమే. అలాగే కుజ దోషమున్నవారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలి. సంవత్సరములో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవితి వంటి ముఖ్యమైన రోజులలో సుబ్రహ్మణ్యున్ని పూజించాలి. కుజదోషము తీవ్రముగా ఉన్న జాతకులు కుజ గ్రహ శాంతులు, కుజగ్రహ హోమాలు, కుజగ్రహ జపాలు, దానాలు చేయాలి.

Tags:    

Similar News