Indian Railway: రైలులో సిగరెట్‌ తాగితే ఏమవుతుంది.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..!

Indian Railway: సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఒకవేళ నడిచే రైలులో సిగరెట్‌ తాగితే తోటి ప్రయాణికులకి ఇబ్బందికరం.

Update: 2023-08-22 11:05 GMT

Indian Railway: రైలులో సిగరెట్‌ తాగితే ఏమవుతుంది.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..!

Indian Railway: సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఒకవేళ నడిచే రైలులో సిగరెట్‌ తాగితే తోటి ప్రయాణికులకి ఇబ్బందికరం. అయినప్పటికీ రైలులో సిగరెట్‌ తాగితే నిబంధనల ప్రకారం తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల వందేభారత్ రైలులో ఓ ప్రయాణికుడు సిగరెట్ కాల్చడం వల్ల చాలామంది ఇబ్బందిపడ్డారు. దీంతో రైల్వే శాఖ స్మోకింగ్ సెన్సార్లని అమర్చింది. ధూమపానం విషయంలో రైల్వే నిబంధనల గురించి ఈరోజు తెలుసుకుందాం.

రైల్వే నియమం

రైలులో ధూమపానం చేయడం రైల్వే చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం నేరం. అంతేకాకుండా రూ.100 నుంచి రూ.500 వరకు జరిమానా విధిస్తారు. రైలులో అగ్గిపుల్ల వెలిగించడం నిషేధం. ఇలాంటి పనులు చేయడం వల్ల మంటలు చెలరేగుతాయి. దీంతో పాటు తోటి ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే రైలులో అగ్నిప్రమాదం వంటి సంఘటనలు జరగకుండా సెన్సార్‌లు ఏర్పాటు చేశామని రైల్వే తెలిపింది. 2500కు పైగా కోచ్‌లలో సెన్సార్‌లు ఏర్పాటుచేశారు.

రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం రైలులో మండే పదార్థాలను తీసుకెళ్లడం నేరం. ఎవరైనా ప్రయాణీకులు రైల్వే నిబంధనలను ఉల్లంఘిస్తే అతను 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇదికాకుండా చాలా మంది ప్రయాణికులు టాయిలెట్‌లో సిగరెట్ తాగవచ్చని అనుకుంటారు. కానీ అక్కడ కూడా పొగ తాగలేరు. మండే అగ్గిపుల్లని రైలు పరిసరాల్లోనో విసిరితే మంటలు చెలరేగే అవకాశం ఉంది. దీనివల్ల తోటి ప్రయాణికులకి చాలా ప్రమాదం.

Tags:    

Similar News