Viral Video: అద్భుతం అంటే ఇదేనేమో.. వైరల్‌ అవుతోన్న షాకింగ్ వీడియో..!

Viral Video: అదృష్టం బాగా లేకపోతే.. అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనే సామెత ఉంటుంది.

Update: 2024-10-14 11:04 GMT

Viral Video

Viral Video: అదృష్టం బాగా లేకపోతే.. అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనే సామెత ఉంటుంది. అయితే అదే అదృష్టం బాగుంటే ఎంతటి ప్రమాదం వచ్చినా తప్పించుకోవచ్చు. ఆయుష్షు గట్టిగా ఉంటే ప్రమాదం కూడా బలాదూర్‌ అవ్వాల్సిందేనని చెప్పే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అంతలోనే బిల్డింగ్‌ పై నుంచి ఓ పెద్ద ట్యాంక్‌ ఒక్కసారిగా కింద పడింది.

బిల్డింగ్‌పై కొందరు వ్యక్తులు ట్యాంక్‌ పనులు చేస్తుండగా, ట్యాంక్‌ చేజారి కింద పడిపోయింది. ప్రమాదవశాత్తు పడిన ట్యాంక్‌ నేరుగా వచ్చి ఆ మహిళాపైనే పడింది. అయితే ఆ మహిళకు చిన్న దెబ్బకూడా తగలకపోవడం విశేషం. దీనికి కారణంగా ఆ ట్యాంక్‌ రెండో చివరిలో పెద్ద రంధ్రం ఉంది. లక్కీగా ఆ ట్యాంక్‌ రంధ్రం సరిగ్గా మహిళ తలపై పడింది. దీంతో సదరు మహిళ ఎలాంటి గాయం కాకుండా బయటపడింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ టీవీలో రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో మొదటిసారి చూడగానే అసలు ఏం జరిగిందన్న విషయం అర్థం కాలేదు. మహిళ పక్కన ట్యాంక్‌ పడిన భావన కలుగుతుంది. కానీ ఒకటికి రెండుసార్లు ఈ వీడియోను చూస్తే కానీ అసలు విషయం అర్థం కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అదృష్టం ఇదేనంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


Tags:    

Similar News