Viral Video: ప్రపంచంలోనే అతి పెద్ద నివాస భవనం.. 39 అంతస్తుల్లో ఏకంగా 20 వేల మంది నివాసం..!

Viral Video: ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌గా ‘రీజెంట్ ఇంటర్నేషనల్‌’కి పేరు ఉంది. ఇది చైనాలోని కియాన్‌జియాంగ్‌ సెంచురీ నగరంలో ఉంది.

Update: 2024-10-08 05:09 GMT

Viral Video: మీకు తెలిసినంత వరకు ఒక అపార్ట్‌మెంట్‌లో ఎంత మంది నివాసం ఉంటారు. మహా అయితే ఒక వెయ్యి మంది లేదా రెండు వేల మంది అంటారా.? అదే ఏకంగా 30 వేల మంది నివసించే వీలుంటే. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 30 వేల మంది నివసించవచ్చు. ఇంతకీ ఆ అపార్ట్‌మెంట్ ఎక్కడ ఉంది.? దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌గా ‘రీజెంట్ ఇంటర్నేషనల్‌’కి పేరు ఉంది. ఇది చైనాలోని కియాన్‌జియాంగ్‌ సెంచురీ నగరంలో ఉంది. 675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం చైనాలోనే అద్భుత కట్టడంగా నిలుస్తోంది. ఈ అపార్ట్‌మెంట్ మొత్తం 39 అంతస్తులతో 'ఎస్‌' షేప్‌లో ఉంది. ఏకంగా 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇందులో గరిష్టంగా 30 వేల మంది నివసించవచ్చు. 

World Largest Residential Building

అయితే ఇంత మంది ఉన్నారు కదా వసతులు ఏమైనా ఇబ్బందిగా ఉంటాయనుకునేరు.. అన్ని రకాల వసతులతో దీనిని నిర్మించారు. షాపింగ్‌ మాల్స్‌ మొదలు.. రెస్టారంట్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, వినోద కార్యక్రమాలు ఇలా అన్ని సౌకర్యాలు ఇందులోనే ఉన్నాయి. ఫిట్‌నెస్‌ సెంటర్లు, ఫుడ్‌ కోర్టులు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వంటి అన్ని ఒకే చోట అందుబాటులో ఉంటాయి.

ఈ అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం 20 వేల మంది నివాసం ఉంటున్నారు. ఇక రెంట్ విషయానికొస్తే ఫ్లాట్‌ విస్తీర్ణం ఆధారంగా మన కరెన్సీలో రూ. 18 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉంటుంది. నిజానికి ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం 2013లో పూర్తయింది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అపార్ట్‌మెంట్ నిర్మాణశైలికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Tags:    

Similar News