Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇలాంటి రైల్లో ప్రయాణిస్తున్నారా.. గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ..!

Shatabdi and Rajdhani Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు.

Update: 2024-06-10 06:31 GMT

Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇలాంటి రైల్లో ప్రయాణిస్తున్నారా.. గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ..!

Vande Bharat Sleeper Trains: గత కొన్ని సంవత్సరాలుగా, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణీకుల సౌకర్యాలపై ఫోకస్ చేసింది. 2019 సంవత్సరంలో రైల్వే మంత్రిత్వ శాఖ సెమీ-హై స్పీడ్ రైలు వందే భారత్‌ను ప్రారంభించిన తర్వాత, సుదూర మార్గాలను అధిగమించడం చాలా సులభం అయింది. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 వందేభారత్ రైళ్లు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు సుదూర ప్రయాణాల కోసం గంటకు 200 కి.మీ వేగంతో నడిచే స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని రైల్వే యోచిస్తోంది.

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధం..

శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో హైస్పీడ్ వందే భారత్ స్లీపర్ రైలును ఏర్పాటు చేయాలని రైల్వే యోచిస్తోందా అనేది ప్రశ్నగా మారింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేశారు. ఇది భారతీయ రైల్వేల యూనిట్. ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడి ఉంది. ఈ రైలు ప్రయాణీకులలో బాగా ప్రాచుర్యం పొందింది. భారతీయ రైల్వేల భవిష్యత్‌లో ఈ సెమీ హైస్పీడ్ రైలు కీలక పాత్ర పోషిస్తుందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం రాజధాని రైల్వే ఉత్తమ సేవలలో ఒకటిగా నిలిచింది. రాబోయే కాలంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు క్రమంగా రానున్నాయి. స్లీపర్ వందే భారత్ ప్రారంభించిన తర్వాత, ఇది ప్రస్తుత రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే అత్యుత్తమ సర్వీసులలో ఒకటిగా పేరుగాంచింది. రాజధాని న్యూఢిల్లీని దేశంలోని వివిధ రాష్ట్రాలతో కలుపుతుంది.

వందే భారత్ రైలును అవసరమైన విధంగా సిద్ధం చేయడానికి సమయం పడుతుందని చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ బిజి మాల్యా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. వందేభారత్ రైళ్ల సంఖ్యను నిర్మించడానికి సమయం పడుతుందని మాల్యా చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News