Viral Video: వామ్మో.. మ్యాంగో జ్యూస్‌ను ఇలా తయారు చేస్తారా.? షాకింగ్‌..

Mango Juice Making Video: మ్యాంగో జ్యూస్‌.. కాలంతో సంబంధం లేకుండా మామిడి పండ్ల ఫ్లేవర్‌ను అందిస్తున్నాయి.

Update: 2024-09-01 08:00 GMT

Viral Video: వామ్మో.. మ్యాంగో జ్యూస్‌ను ఇలా తయారు చేస్తారా.? షాకింగ్‌..

Mango Juice Making Video: మ్యాంగో జ్యూస్‌.. కాలంతో సంబంధం లేకుండా మామిడి పండ్ల ఫ్లేవర్‌ను అందిస్తున్నాయి. వీటిని చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఇష్టపడి తాగుతుంటారు. అయితే వీటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడైనా ఆలోచించారా.? కనీసం మీ ఊహకు కూడా అందని విధంగా ఈ జ్యూస్‌ల తయారీ ఉంటుంది.

టెట్రా ప్యాక్‌లో అందుబాటులో ఉండే మ్యాంగో జ్యూస్‌ తయారీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఏ కంపెనీకి చెందిందో తెలియదు కానీ, ఈ జ్యూస్‌ తయారీని చూస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. మరోసారి మ్యాంగ్ జ్యూస్‌ తాగాలంటేనే భయపడేలా ఉంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందనేగా..

ముందుగా ఓ మిషన్‌లో నీరు పోశారు. అనంతరం అందులో ఫుడ్‌ కలర్‌ కలిపారు. తర్వాత ఏదో పౌడర్‌ చక్కెర వేసి బాగా కలిపారు. ఆ తర్వాత అందులో కొంత మొత్తంలో మ్యాంగో జ్యూస్‌ను కలిపారు. తర్వాత మరోసారి చక్కెరను వేసి మిక్స్‌ చేశారు. ఆ తర్వాత ఆ ద్రావణాన్ని టెట్రా ప్యాక్‌లో ఫిల్ చేసి ప్యాక్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో మ్యాంగ్ జ్యూస్ ఇలా తయారు చేస్తారా.? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే అన్ని కంపెనీలు ఇలాగే చేస్తాయా.? అంటే కచ్చితంగా చెప్పలేమంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. 


Tags:    

Similar News