Ganesh Chaturthi 2024: 21 రకాల పత్రాలతో వినాయకుడి పూజ.. అసలు రహస్యం ఏంటో తెలుసా?

Vinayaka Chavithi 2024: గరికపూస చాలు గణపతిని ప్రసన్నం చేసుకునేందుకు... అందుకే గణపతి పూజలో పత్రి పూజ చాలా ప్రత్యేకం.

Update: 2024-09-07 02:03 GMT

Ganesh Chaturthi 2024: 21 రకాల పత్రాలతో వినాయకుడి పూజ.. అసలు రహస్యం ఏంటో తెలుసా?

Vinayaka Chavithi 2024: గరికపూస చాలు గణపతిని ప్రసన్నం చేసుకునేందుకు... అందుకే గణపతి పూజలో పత్రి పూజ చాలా ప్రత్యేకం. 21 రకాల పత్రాలతో స్వామిని ఆరాధించడం వెనుక ఆరోగ్య సూత్రాలతో పాటు ప్రకృతిని పరిరక్షించడం పరమార్థం. అందుకే గణపతి పూజ ప్రకృతిలో మమేకం అయ్యే సంప్రదాయంతో ముడిపడి ఉంది.

తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడు పూజలకి అంత సిద్ధం అయింది. వినాయక చవితి పండుగలో ప్రతి అంశం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. దేవుడికి నివేదించే ప్రసాదాల దగ్గర నుంచి పూజ వరకు ప్రతి ఆచారం ప్రకృతి పరిరక్షణతో ముడిపడి ఉంది. వినాయక పూజలో 21 రకాల పత్రాలు వినియోగిస్తారు. రేగు, జిల్లేడు, మారేడు, మామిడి, ఉమ్మెత్త, ఉసిరి, జామ, దానిమ్మ, తులసి ఇలా చాలా ఆకులను ఆ లంబోదరుడుకి సమర్పిస్తారు. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగిన మొక్కలే. వాటిని నుంచి వచ్చే గాలి పీల్చడం వలన ఆరోగ్యంగా జీవిస్తారని ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చెబుతోంది. అందుకే విఘ్నేశ్వర పూజలో పత్రి పూజ చాలా ప్రత్యేకం.

వృక్ష జాతులను రక్షించాలని ఈ పండుగలో పత్రి పూజ ఆనవాయితీ పెట్టారు. పండుగ ఏదైనా, సంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉన్న అవన్నీ మానవాళి హితం కోసం మాత్రమే చెప్పబడ్డాయి. ఈ వినాయక చవితి అందరికీ శుభాలు కలగజేయాలను కోరుకుందాం.

Tags:    

Similar News