Ugadi 2025: ఉగాది పండుగ రోజు తలంటు స్నానం ఎందుకు చేయాలి? దాని ప్రయోజనాలు తెలుసా?

Ugadi Head Bath Importance: మార్చి 30 ఆదివారం ఉగాది పండుగ జరుపుకొనున్నారు. ఈసారి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం గా నామకరణం చేశారు. అయితే ఉగాది పండుగ రోజు తలస్నానానికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Update: 2025-03-28 10:13 GMT
Ugadi 2025 Why is Head Bath on Ugadi Important Benefits You Should Know

Ugadi 2025: ఉగాది పండుగ రోజు తలంటు స్నానం ఎందుకు చేయాలి? దాని ప్రయోజనాలు తెలుసా?

  • whatsapp icon

Ugadi Head Bath Importance: సాధారణంగా ప్రతి పండుగలకు మనం తల స్నానం చేయడం.. కొత్త బట్టలు కట్టుకోవడం.. ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజలు వంటివి చేస్తాం. అయితే ఉగాది పండుగకు తలస్నానం చేయడం ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగింది. ఈరోజు తలస్నానం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉగాది అంటేనే తలంటుకొని స్నానం చేయడం.

ఉగాది పండుగ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో వేడుకగా జరుపుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా ఈ ఉగాది పండుగ నిర్వహిస్తారు. ఉగాది అంటే కొత్త సంవత్సరం. అయితే ఉగాది పండుగ తర్వాతనే ఇక ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఇక మన హిందూ పండుగల్లో ఏ పండుగ అయినా తలస్నానం అంటేనే నూనెతో ముడిపడి ఉంటుంది. ఈరోజు తలంటి స్నానం చేయడం వల్ల ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రధానంగా ఉగాది పండుగ రోజు తలస్నానం ఎందుకు చేస్తారంటే..?

ఆ పండుగ రోజు నూనెతో తల స్నానం చేయడం వల్ల మనలో ఆధ్యాత్మికత స్పృహ మేల్కొంటుంది. అంతేకాదు ఇలా నూనెతో తలంటు స్నానం చేయడం వల్ల మనలో తేజస్సు కూడా పెరుగుతుంది. ఇక మన శరీరంలో ఉండే ఉండే నెగెటివిటీని కూడా పూర్తిగా తొలగిస్తుంది. అంతేకాదు తలంట స్నానం చేయడం వల్ల మనలో పాజిబిలిటీ పెరిగిపోతుంది. ఇలా మనం నూనెతో శరీరం అంతా మర్దన చేసుకుని తలంటుకొని స్నానం చేయడం వల్ల ఒక రక్షణ పొర కూడా ఏర్పడుతుంది. కొన్ని దైవిక అంశాలు కూడా మనలో ఉత్పన్నమవుతాయి.

మనం శరీరం జుట్టుకు ఇలా నూనె పెట్టి అభ్యంగన స్నానం చేయడం వల్ల తేజస్సు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. జీవ శక్తి పెరుగుతుంది. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మన హిందూ సాంప్రదాయాల్లో నువ్వుల నూనెకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ నువ్వుల నూనెతో ఒళ్ళు, తల బాగా మర్దన చేసి ఆ తరువాత శనగపిండితో మర్దన చేసుకుని స్నానం పూర్తి చేస్తారు. దీనివల్ల మన ఒళ్లు తేలికగా కూడా అనిపిస్తుంది.

Tags:    

Similar News