Ayushman Bharat Card: ఏప్రిల్ నుంచి ఉచితంగా రూ.5 లక్షల బీమా.. వీళ్లు మాత్రమే అర్హులు

Ayushman Bharat Card 2025 Eligibility: 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్థిక పరిమితలతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్‌ను ఏప్రిల్ నుంచి అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది.

Update: 2025-03-30 12:12 GMT
Ayushman Bharat Card

Ayushman Bharat Card: ఏప్రిల్ నుంచి ఉచితంగా రూ.5 లక్షల బీమా.. వీళ్లు మాత్రమే అర్హులు

  • whatsapp icon

Ayushman Bharat Card 2025 Eligibility: ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల పథకం 70 ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీం అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించనుంది. ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు, మెడిసిన్ అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు 416 నెట్వర్క్ ఆసుపత్రిలో కు తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చారు .

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఎన్నో ఆసుపత్రులు లింక్‌ అయి ఉన్నాయి. ప్రభుత్వం నేరుగా ఆస్పత్రులకు బిల్లు చెల్లిస్తుంది. అయితే దీనికి ముందుగా ఆయుష్మాన్ భారత్ యోజనాలలో ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పథకం లబ్ధి పొందుతారు. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అన్ని చికిత్సలు అందిస్తారు. కానీ కాస్మోటిక్ సర్జరీ, డెంటల్‌, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, ఒబెసిటీ, మానసిక సమస్యలకు మాత్రం చికిత్స అందించారు.

ఈ పథకం ద్వారా ఏడాదికి ఐదు లక్షలు ఆరోగ్య బీమా అందిస్తారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 2025 నిరుపేదకి కుటుంబాలకు 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లో కూడా దీనికి అర్హులు. ఇది వరకు వయస్సు పెద్ద ఉన్నవారికి ఆరోగ్య బీమా ప్రైవేటు రంగాలు అవకాశం ఇచ్చేవి కావు.

వీలు మాత్రమే అర్హులు ..

ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనలో భారత్ శాశ్వత నివాసితులై ఉన్నవారు మాత్రమే అర్హులు.

సీనియర్ సిటిజెన్‌లు 70 ఏళ్లు పైబడిన వారు కూడా అర్హులు, వీళ్ళు కార్డు కలిగి ఉండాలి.

ఆదాయం అర్బన్, రూరల్ ఏరియాలకు నిర్దేశిత ఆదాయ పరిమితిని మించి ఉండకూడదు.

ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు కలిగి ఉంటే ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమాను పొందుతారు. ఉచిత చికిత్సలు పొందుతారు. ఉచితంగా మెడిసిన్స్ అందిస్తారు. ఎమర్జెన్సీ ఇతర సర్వీసులు కూడా పొందుతారు. ఇవన్నీ నిరుపేద కుటుంబాలకు వర్తిస్తాయి.

మీరు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పొందాలంటే అధికారిక వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అక్కడ మీ ఆధార్ కార్డు ఇతర వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ చేస్తే ఆధార్ కార్డు పొందుతారు.

Tags:    

Similar News