Myanmar Earthquake: భూకంపాలు ఎందుకు వస్తాయి? మానవ తప్పిదాలు కారణంగా సంభవిస్తాయా?
Myanmar Earthquake: ప్రకృతి మార్పులూ, మానవ తప్పిదాలూ కలగలిపి భూకంపాల తీవ్రతను పెంచుతున్నాయి. భూమిలో అంతర్లీన కదలికలపై మనిషి ప్రభావం పెరుగుతున్న కొద్దీ, ఈ ప్రకృతి విపత్తులు మరింత తీవ్రమవుతాయన్నది స్పష్టమవుతోంది.

Myanmar Earthquake: భూకంపాలు ఎందుకు వస్తాయి? మానవ తప్పిదాలు కారణంగా సంభవిస్తాయా?
Myanmar Earthquake: భూమి ఒక్కసారిగా ఊగిపోవడం అంటే కాళ్ల కింద నేలే కదిలిపోయినట్టు. ఇళ్లలోని సామాన్లు ఒక్కసారిగా కిందపడతాయి. గోడలు బద్దలవుతాయి. రోడ్లు పగిలిపోతాయి. భారీ భవనాలు క్షణాల్లో కూలిపోతాయి. భూకంపం సంభవించినప్పుడు వచ్చే ధ్వంసం అంతే తీవ్రంగా ఉంటుంది. మియన్మార్, బ్యాంకాక్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన భూకంపం కూడా అదే స్థాయిలో భయానకతను చూపించింది. లక్షలాది మంది కట్టడాల శిథిలాల్లో చిక్కుకున్నారని సమాచారం. మరణాల సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేయడం కూడా అధికారులకు కష్టమవుతోంది.
భూమి లోపల పెరిగే ఒత్తిడి కారణంగా ఉపరితలంపై ఊగే ప్రక్రియను భూకంపం అంటారు. భూమి నలుగు పొరలుగా ఏర్పడింది. ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్. ఇందులో మిగిలిన పొరల కంటే బయట ఉండే క్రస్ట్, మాంటిల్ కలిసి లిథోస్ఫియర్‌ను ఏర్పరుస్తాయి. ఇది అనేక టెక్టోనిక్ ప్లేట్‌లుగా విభజించబడి ఉంటుంది. ఇవి నిరంతరం కదులుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ పలకలు ఒక్కసారిగా గట్టిగా ఢీకొంటే, దాని ప్రభావం భూమి ఉపరితలానికి చేరి భూప్రకంపనలు ఏర్పడతాయి.
భూకంపం మొదలయ్యే ప్రదేశాన్ని భూకంప కేంద్రం అంటారు. అక్కడ నుంచి ఉద్భవించే శక్తి ఎక్కడికి వెళ్తుందో, అక్కడ తీవ్రత ఏ రేంజ్‌లో ఉంటుందో ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి దూర ప్రాంతాలకూ ప్రకంపనలు చేరి అక్కడి నిర్మాణాలను దెబ్బతీయగలవు. అగ్నిపర్వతాల చుట్టూ ఏర్పడే అంతర్గత ఒత్తిడులు కూడా భూకంపాలకు కారణం కావచ్చు. ఇది పూర్తిగా సహజ ప్రక్రియ అయినప్పటికీ, మానవ చర్యల వల్ల కూడా భూమిలో అస్థిరత ఏర్పడుతోంది.
అడవుల తొలగింపు, పర్వతాలను తవ్వడం, లోతైన మైనింగ్, డ్యామ్‌లు కట్టడం వంటివన్నీ భూమిపై అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇది సహజంగా కదలాల్సిన టెక్టోనిక్ ప్లేట్‌ల కదలికకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఒక్కసారి ఈ ప్లేట్‌లు గట్టిగా గుద్దుకుంటే తీవ్రమైన భూకంపాలు సంభవిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అణు పరీక్షలు లేదా భారీ నిర్మాణాలు కూడా స్వల్పంగా అయినా భూమిని కదిలించే అవకాశం కలిగిస్తాయి.