చైర్ ఛాలెంజ్..టిక్ టాక్ లో వైరల్! మీరూ ప్రయత్నిస్తారా?
ఈ ఆటలో కేవలం మహిళలు మాత్రమే విజయం సాధించగలరట. ఎంత పెద్ద మొనగాడైనా ఈ సవాలు గెల్వలేరని అంటున్నారు.. ఇంతకీ ఏమా ఆట..తెలుసుకుందాం రండి!
కొన్ని కొన్ని పనులు మీరు చేయలేరు అని ఎవరైనా అంటే మనకి విపరీతమైన పౌరుషం వచ్చేస్తుంది. ఎందుకు చేయలేము అనుకుంటాం. సరిగ్గా ఇలాంటి పనులనే పరిచయం చేస్తూ ఛాలెంజిలు విసురుతుంటారు సోషల్ మీడియాలో కొందరు. ఇప్పుడు మీకు చెప్పబోతున్నాడు కూడా అదే!
ఈ మధ్య టిక్ టాక్ యాప్ లో ఓ ఛాలెంజ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ ఛాలెంజ్ కేవలం ఆడవాళ్లు మాత్రమే పూర్తి చేయగలరట. దమ్ముంటే మగవాళ్ళెవరన్నా దీనిని చేసి చూపించండి అంటూ సవాళ్లు విసిరారు టిక్ టాక్ లో. ఇంకేముంది చాలా మంది ఔత్సాహికులు కూడా దీనికి సై అంటూ రంగంలోకి దిగేశారు. అయితే, ఎవరూ కూడా ఆ ఛాలెంజ్ పూర్తి చేయలేకపోయారట.
ఇంతకీ ఆ సవాలేమిటి?
చూడటానికి చాలా సింపుల్ గా కనిపించే సవాలు ఇది. ఆడవాళ్ళకు మాత్రం అది కరెక్ట్. చాలా ఈజీగా వాళ్ళు చేసేయగలుగుతారు. ఎంత బలమున్న మగాడైనా ఆ ఛాలెంజ్ గెలవడం కష్టం. ఇంతకీ ఏమిటంటే.. గోడకి సరిగ్గా మూడడుగుల దూరంలో నిలబడాలి. అక్కడనుంచి తలను గోడపైకి వంచాలి. తరువాత గోడకీ మీకు మధ్యలోకి ఓ కుర్చీ పెట్ట్టాలి. ఇప్పిడు ఆ కుర్చీని రెండు చేతులతోనూ పట్టుకుని నిటారుగా నిలబడగలగాలి. కుర్చీ జారిపోకూడదు. మీరు అక్కడనుంచి వెనక్కి జరగకూడదు. ఇంతే. చల్లేనండీ మరీ బడాయి అనుకుంటున్నారా.. ఇది నిజంగా మగాళ్లు చేయలేరు. చాలా మంది ప్రయత్నించి తమ ట్విట్టర్ లో ఆ వీడియో షేర్ చేశారు. ఎందుకు చేయలేకపోయామో లాజిక్ దొరకడం లేదు అని వారు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ట్విట్టర్ లో కూడా ట్రేండింగ్ గా మారింది.
ఈ ఫీట్ చేయాలని ప్రయత్నించి భంగ పడ్డ మగధీరుల వీడియోను శామ్ ట్విజ్జీ అనే వారు షేర్ చేశారు. మీ కోశం ఆ వీడియో ట్వీట్ ను అందిస్తున్నాము. చూడడండి. అన్నట్టు మీరు కూడా ఓ ప్రయత్నం చేయండి సరదాగా. ఈ ప్రయత్నం లో మీ నడుములు జాగ్రత్త. మీ నడుములకు మా బాధ్యత లేదు సుమండీ!
Tried the tik tok chair challenge cause i thought it was fake...... #TikTok #ChairChallenge pic.twitter.com/5Nf5NYsMAt
— Izzy Sam (@SamTwizzy5) November 20, 2019