Viral Video: ట్రైన్‌ జర్నీలో మీ పిల్లలకు ఫోన్‌ ఇస్తున్నారా.? జాగ్రత్తగా ఉండాల్సిందే..

Viral Video: ప్రతీ ఒక్కరి చేతిలో కచ్చితంగా స్మార్ట్ ఫోన్‌ ఉండాల్సిందే. అన్నం తింటున్నా, టీవీ చూస్తున్నా చివరికి ప్రయాణం చేస్తున్నా ఫోన్ చూస్తూనే ఉంటున్నారు.

Update: 2024-10-08 14:30 GMT

Viral Video: ట్రైన్‌ జర్నీలో మీ పిల్లలకు ఫోన్‌ ఇస్తున్నారా.? జాగ్రత్తగా ఉండాల్సిందే..

Viral Video: ప్రతీ ఒక్కరి చేతిలో కచ్చితంగా స్మార్ట్ ఫోన్‌ ఉండాల్సిందే. అన్నం తింటున్నా, టీవీ చూస్తున్నా చివరికి ప్రయాణం చేస్తున్నా ఫోన్ చూస్తూనే ఉంటున్నారు. ముఖ్యంగా బస్సు, రైలు జర్నీ చేసే సమయంలో ఫోన్‌లతో గడిపేస్తుంటారు. అయితే చిన్నారులు కూడా స్మార్ట్ ఫోన్స్‌కు బానిసలుగా మారిపోతున్నారు. గంటల తరబడి ఫోన్లతో కుస్తీలు పడుతున్నారు.

అయితే రైళ్లలో, బస్సుల్లో జర్నీ చేసే సమయంలో మీ పిల్లలకు ఫోన్‌లు ఇస్తున్నారా.? మరీ ముఖ్యంగా విండో పక్కన కూర్చున్న సమయంలో పిల్లలకు ఫోన్‌లు ఇస్తుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో ఇదే విషయాన్ని చెబుతోంది. రైళ్లలో విండో సీట్లలో కూర్చున్న వారి ఫోన్‌లను ప్లాట్‌ఫామ్‌లపై ఉండే కొందరు దొంగలు కొట్టేసే సందర్భాలు ఎన్నో చూశాం.

ఈ క్రమంలోనే తాజాగా ఓ చిన్నారి రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో విండో సీటులో కూర్చుని ఫోన్‌లో గేమ్‌ ఆడుకుంటోంది. అదే సమయంలో రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. దీంతో అంతలోనే ప్లాట్‌ఫామ్‌పైనున్న ఓ అజ్ఞాత, వ్యక్తి కదులుతున్న రైల్లో ఆ చిన్నారిలో చేతిలో ఉన్న మొబైల్‌ను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

దీంతో చిన్నారి అరవడం మొదలుపెట్టింది. కానీ దొంగను అడ్డుకోవడం మాత్రం చిన్నారికి చేతకాలేదు. చివరకు ఆ దొంగ ఫోన్ లాక్కొని పారిపోయాడు. ఇదంతా క్షణాల్లో జరిగింది. అక్కడ ఉన్న ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఇదంతా కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చిన్నారులు రైళ్లలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఈ వీడియో కావాలనే రూపొందించినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News