Indian Railway: దేశంలోని ఈ రైల్వే స్టేష‌న్‌ల‌లో ఈ ఆహార ప‌దార్థాలు చాలా ఫేమ‌స్..!

Indian Railway: దేశంలో అతిపెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ ఇండియ‌న్ రైల్వే. రైల్వే ప్రయాణం చాలా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది.

Update: 2021-10-27 16:45 GMT
దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్ లలో ఫేమస్ ఫుడ్ (ఫైల్ ఇమేజ్)

Indian Railway: దేశంలో అతిపెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ ఇండియ‌న్ రైల్వే. రైల్వే ప్రయాణం చాలా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. వివిధ స్టేష్‌న్‌ల‌లో రైలు ఆగుతూ వెళ్ల డాన్ని ప్ర‌యాణికులు బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు ఇండియాలో కొన్ని రైల్వే స్టేష‌న్‌ల‌లో కొన్ని ఆహార ప‌దార్థాలు ఫేమ‌స్‌. ఆ రైల్వేస్టేష‌న్ వెళ్లిన ప్ర‌యాణికులు వాటిని తిన‌కుండా ఉండ‌లేరు. అలా ఏ ఏ రైల్వేస్టేష‌న్‌ల‌లో ఏ ఏ ఆహార ప‌దార్థాలు ఫేమ‌స్ అయ్యాయో తెలుసుకుందాం.

1. జలంధర్ స్టేషన్

ఎప్పుడైనా పంజాబ్‌లోని జలంధర్ స్టేషన్‌లో రైలు ఆగితే తప్పనిసరిగా ఇక్కడ దొరికే చోలే-భతురాను తినాలి. ఇక్కడ చోలే భాతురే చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచిని ఎప్పటికీ మ‌రిచిపోలేరు.

2. ఖడ్గూర్ రైల్వే స్టేషన్

పశ్చిమ బెంగాల్‌లోని ఖడ్గూర్ రైల్వే స్టేషన్‌లో స్పైసీ దమ్ ఆలూను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రుచి చూడాలి. మీరు ఈ స్టేషన్‌కి వెళ్లిన‌ప్పుడు దమ్ ఆలూ సువాసన మిమ్మల్ని అస్స‌లు విడిచిపెట్ట‌దు. ఎందుకంటే ఆ వాస‌న అలాంటిది మ‌రి.

3. ఎర్నాకులం స్టేషన్

కేరళలోని ఎర్నాకులం జంక్షన్ స్టేషన్ కూడా ఆహారానికి ప్రసిద్ధి. మీరు ఇక్కడ చేసే కుడుములు తినాలి. పచ్చి అరటిపండు, పప్పు, మైదాతో చేసిన ప‌కోడీలు ఈ స్టేష‌న్‌లో చాలా ఫేమ‌స్.

4. రత్లాం రైల్వే స్టేషన్

మీరు ఎప్పుడైనా రత్లాం రైల్వే స్టేషన్ గుండా వెళితే ఇక్కడ దొర‌కే పోహా తినాలని గుర్తుంచుకోండి. సెవ్, పచ్చి ఉల్లిపాయ, తేలికపాటి నిమ్మరసంతో చేసిన ఈ పోహా రుచి జీవితాంతం గుర్తుండిపోతుంది.

5. అబూ రోడ్ రైల్వే స్టేషన్

రాజస్థాన్‌లోని అబు రోడ్ రైల్వే స్టేషన్‌లో ప్రజలు తమ చేతిలో రబ్దీ ప్లేట్‌తో తరచుగా కనిపిస్తారు. ఈ రబ్డీ రుచి చాలా ప్రత్యేకమైనది. మీరు ఒక్కసారి దీనిని తింటే పదే ప‌దే తినాల‌నిపిస్తుంది.

6. మధురై స్టేషన్‌

కర్నాటకలోని మధురై స్టేషన్ లో దొరికే మద్దూరు వడ కూడా చాలా ఫేమ‌స్‌. ప్రతి ఒక్కరూ జీవితంలో వీటిని ఒక్కసారైనా తినాలి.

Tags:    

Similar News