బాబాల ఆశీర్వాదలు ఎలా ఉంటాయో మనకి తెలిసిందే... అందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అని చెప్పాలి. అది పక్కన పెడదాం ... కానీ పూజారులు ఆశీర్వాదం మాత్రం ఒకేలా ఉంటుంది. అది కూడా అందరికి తెలిసిందే.. మనం పూజారి కాళ్ళని మొక్కితే వారు చేతులతో ఆశీర్వదీస్తారు. కానీ ఇక్కడో పూజారి మాత్రం అందుకు బిన్నంగా ఉన్నాడు. భక్తులు ఆశీర్వాదం కోసం వస్తే ఏకంగా తలపై కాళ్ళు పెట్టి ఆశీర్వాదిస్తున్నాడు. ఈ వింత సంఘటన ఓడిశాలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయదశమి సందర్భంగా ఓడిశా రాష్ట్రంలోని ఖర్ధా జిల్లా బన్‌పూర్ లోని కొంతమంది భక్తులు ఈ పూజారి వద్ద ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చారు. అందులో వారు మోకాళ్ళపై కూర్చుంటే ఆ పూజారి వాళ్ల తలపై కాలుపెట్టి ఆశీర్వదించారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన పూజారి మాత్రం అలా చేస్తేనే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అని చెప్పుకొస్తున్నాడు.
#WATCH A temple priest gives blessings to people by putting his foot on their heads on #VijayaDashami (8th October), in Banpur area of Khordha, #Odisha pic.twitter.com/1LxpnnfPqP
— ANI (@ANI) October 10, 2019