Photo puzzle: అంతా బాగానే ఉన్నా.. ఈ ఫొటోలో ఓ తప్పు ఉంది. గుర్తు పట్టారా.?
Photo puzzle: అంతా బాగానే ఉన్నా.. ఈ ఫొటోలో ఓ తప్పు ఉంది. గుర్తు పట్టారా.?
Photo puzzle: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ అర్థమే మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ఇదే క్రమంలో రీల్స్, వైరల్ వీడియోలు తెగ ట్రెండ్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటన్నింటితో పాటు ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన కంటెంట్ కూడా వైరల్ అవుతోంది.
ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు అనగానే మనకు సహజంగా గుర్తొచ్చేది ఫొటోలో దాగి ఉన్న అంశాలను గుర్తించడం. వీటితో పాటు మనిషి ఆలోచన విధానాన్ని అంచనా వేసే ఫొటోలు కూడా వైరల్ అవుతుంటాయి. అలాగే ఫొటోల్లో ఉండే తప్పులను గుర్తించే ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ ఫోటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పైన కనిపిస్తున్న ఫోటో చూడగానే ఓ ఆఫీస్ రూమ్ లాగా కనిపిస్తోంది కదూ! డెస్స్‌పై ఓ ల్యాప్‌టాప్, ల్యాండ్ లైన్ ఫోన్, ఓ చెయిర్ ఉన్నాయి. అయితే ఈ ఫొటోలో ఓ తప్పు ఉంది కనిపెట్టగలరా.? ఈ తప్పును కేవలం 10 సెకండ్లలో గుర్తిస్తే మీ మెదడు చాలా షార్ప్‌గా పనిచేస్తుందని అర్థం. అయితే ఈ తప్పును గుర్తించాలంటే మీ మెదడు చాలా షార్ప్‌గా పనిచేయాలి. ఇంతకీ ఆ తప్పేంటో గుర్తించారా.? గుర్తించలేకపోతే మీకో క్లూ.. మీకు ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయో తెలిస్తే ఇందులోని తప్పును ఇట్టే గుర్తించవచ్చు. ఇప్పటికే మీకు సమాధానం తెలిసి పోవోచ్చు. అవును నిజమే.. ఈ ఫొటోలో ఉన్న ఆ తప్పు మరెదో కాదు జూన్ నెలలో 31 రోజులు ఉండడమే. సాధారణంగా జూన్‌లో 30 రోజులు ఉంటాయి. కానీ ఇందులో 31 రోజులు ఉన్నాయి. ఇదే ఈ ఫొటోలో ఉన్న తప్పు.