నలుగురు ఫ్రెండ్స్ తో కలిస్తే మనం అలా చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం పదా అని పక్కనే ఉన్నా హోటల్ లో కూర్చొని మాట్లాడుకుంటాం.. అక్కడ ఎక్కడో మొదలైన ముచ్చట ఇంకెక్కడికో వెళ్తుంది. గంటలు గంటలు అక్కడే ముచ్చట్లు కానీస్తాము. హోటల్ యజమానులు కూడా పర్వాలేదులే గిరాకి వస్తుందిలే అని ఊరుకుంటారు. అంతా అయిపోయాక డబ్బులు కడితే తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్.. తమిళనాడు రాష్ట్రంలోని ఓ చాయ్ వాలా హోటల్ లో జోకుల్ చెప్పి ఇతరులను నవ్వించాలి. ఉరికే కాదులెండి. ఓ టీ ఫ్రీగా ఇస్తానని అంటున్నాడు ఆ హోటల్ యజమాని.. ఇంతకి ఆ ఇంట్రెస్టింగ్ కథ ఏంటో మనం కూడా చూద్దాం..
సంకీ మంకీ టీస్టాల్ అనే టీ స్టాల్ తమిళనాడు రాష్ట్రం నాగర్ కోయిల్ జిల్లా కేంద్రంలోని దళవాయిపురం అనే ప్రాంతంలో ఉంది.. ఆ హోటల్ యజమాని పేరు విజయ్.. అక్కడికి వచ్చిన వారు జోక్ చెప్పి, ఇతరులను నవ్వించాలనేది అతని కోరిక.. ఆ కోరికినే ఏకంగా మనోడు నిబంధన చేసేసాడు. అక్కడికి వచ్చేవాళ్లకి తప్పకుండా జోకులు చెప్పాలని రూల్ పాస్ చేసాడు. ఆ జోక్ సినిమాది అయిన ఒకే, లేకుంటే బయటది అయిన ఒకే.. మొత్తానికి మాత్రం నవ్వించాలి అంతే.. ఇదేంటి అని అక్కడికి వచ్చిన వాళ్ళు అడగగా రాజకీయాల గురించి మాట్లాడి కొట్లాడుకోవద్దు అంటాడు ఆ హోటల్ యజమాని..
తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో చాయ్ దుకాణాలు వద్దకి వచ్చి అక్కడ చాయ్ తాగుతూ రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకుంటూ వివాదాలకు పోతుంటారు. అయితే ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడవద్దు అని కొందరు హోటల్ యజమానులు ఏకంగా బోర్డే పెట్టారు. దీనిని మరింత తగ్గించడానికి విజయ్ అనే హోటల్ యజమాని జోక్ చెప్పి ఫ్రీగా చాయ్ పట్టండి అనే ఆఫర్ ని పెట్టి అందరిని నవ్విస్తున్నాడు.