నేడే జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం

సాంకేతిక విజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం అని కూడా అంటారు. అంటే పరికరాలు, జ్ఞానాన్ని ఉపయోగించి సవరణలు చేయడాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటారు.

Update: 2020-05-11 07:03 GMT
National Technology Day

సాంకేతిక విజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం అని కూడా అంటారు. అంటే పరికరాలు, జ్ఞానాన్ని ఉపయోగించి సవరణలు చేయడాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటారు. యంత్రాలు, సాంకేతికతలు, చేతినైపుణ్యాలు, వ్యవస్థలు, సంస్థ యొక్క పద్ధతులలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు, అసలు సమస్యే రాకుండా ముందుగానే సమస్య పరిష్కారాన్ని మెరుగుపరచుకోవడానికి అనుకున్న నిర్దిష్ట విధి లక్ష్యాన్ని సరియైన సమయానికి పూర్తి చేయడానికి ఈ సాంకేతిక విజ్ఞానం ఉపయోగపడుతుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరజ్ఞానం కూడా పెరిగిపోతుంది. నాటి రాతియుగం నుంచి నేటి రాకెట్‌ యుగం వరకు జరిగిన మానవ అభివృద్ధి పరిణామ క్రమంలో సైన్స్‌ కీలక పాత్ర పోషించింది. ఆధునిక సమాజానికి ఆయుపట్టుగా సైన్స్‌ నిలుస్తుంది. నేటి సమాజాన్ని శాస్త్ర సాంకేతిక రంగమే శాసిస్తుంది. ప్రతీ దేశం అభివృద్ధి సైన్స్‌ పైనే ఆధారపడి ఉంది. దేశంలోని మట్టిలో మానిక్యాల లాంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు విజ్ఞానాన్ని అందించి వారి ఉనికిని ప్రపంచానికి చాటుకున్నారు. రక్షణ, టెక్నాలజీ రంగాల్లో అభివృద్దిని సాధించి ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు.

భారతదేశంలో మొట్టమొదటి అణు పరీక్షలను 1974లో నిర్వహించారు. ఆ తర్వాత సుమారుగా 24 సంవత్సరాల తరువాత అంటే 1998వ సంవత్సరం మే 11 న భారతదేశం రెండో అణ్వస్త్ర పరీక్షలను రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలో నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-2 లేదా ఆపరేషన్ శక్తి అంటారు. అంతే కాదు సరిగ్గా అదే రోజున ఆపరేషన్ శక్తి అణు పరీక్షలలో అప్పటి ఏరోస్పేస్ ఇంజనీర్ డా.అబ్దుల్ కలాం నిర్వహించిన మన మొదటి దేశీయ విమానం హంస-3 పరీక్షలు, త్రిశూల్‌ క్షిపణులు, ఆపరేషన్లు విజయవంతంగా పరీక్షించబడ్డాయి. ఆ రోజునే అణుపరీక్షల్లో మొదటి వార్షికోత్సవాన్ని జరపుకున్నారు. అప్పటి నుంచి మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినం(టెక్నాలజీ డే)గా జరుపుకొంటున్నారు. దేశంలోని వివిధ సాంకేతిక సంస్థలలో, ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించి సైన్స్‌కి ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తారు. 

Tags:    

Similar News