Snake Mystery: లేటు వయసులో గుడ్లు పెట్టిన కొండ చిలువ..అదీ మగ తోడు లేకుండా! అలా ఎలా?
Snake mystery | ఆ కొండచిలువ వయసు 62. 20 ఏళ్లుగా ఒనత్రిగా ఉంటోంది. ఇప్పుడు ఏడు గుడ్లు పెట్టింది. జూ సిబ్బందికి షాకిచ్చింది. అలా ఎలా అని ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు జూ అధికారులు!
లేటు వయసులో అదీ తోడు లేకుండా గుడ్లు పెట్టి రికార్డు సృష్టించింది ఓ కొండచిలువ. మిస్సోరీలోని సెయింట్ లూయీస్ జూ లో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆ కొండచిలువ వయసు 62 సంవత్సరాలు. 20 ఏళ్ల నుంచి ఆ కొండచిలువ ఒక్కటీ ఏ తోడూ లేకుండా ఉంటోంది. మగ కొండచిలువ లేకపోయినా ఈ కొండచిలువ గుడ్లు పెట్టడంతో జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
సాధారణంగా ఈ బాల్ పైథాన్ లు 60 ఏళ్ల వయసులోనే పునరుత్పత్తి ఆపివేస్తాయి. అయితే, ఇప్పడు 62 ఏళ్ల వయసులో ఈ కొండ చిలువ గుడ్లు పెట్టడం పై జూ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. మొత్తం ఏడూ గుడ్లు ఈ కొండచిలువ పెట్టింది. వాటిలో రెండిటిని జెనిటిక్ శాంపిలింగ్ కోసం పంపించారు. వీటిని పరీక్షించడం ద్వారా గుడ్లు ఎలా పెట్టింది అనే విషయాన్ని తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. నిజానికి పాములు చాలా వరకూ ఆలస్యంగా ఫలదీకరణం చెందడానికి వీలుగా కొంత వీర్యాన్ని తమలో నిలువ ఉంచుకుంటాయి. అయితే, దానిని కూడా అరవై ఏళ్ల వయసులోపులోనే ఫలదీకరిస్తాయని జూ హెర్పటాలజీ మేనేజర్ మార్క్ వానర్ తెలిపారు. ఇక ఇందులో రెండు గుడ్లు పనిచేయకుండా పోయాయి. మిగిలిన మూడు గుడ్లను పిల్లలను చేయడానికి ఇంక్యుబెటర్ లో ఉంచారు.
ఇక జూ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వెబ్ అందించిన సమాచారం మేరకు ఇప్పుడు కొండచిలువ గుడ్లు పెట్టడం అసాధారణ విషయం కాదు కానీ.. ఏ రకంగా గుడ్లు పెట్టింది అనేది తెలుసుకోవాల్సి ఉంది. ఇకపోతే.. ఈ జూలో ఒక మగ కొండచిలువ కూడా ఉంది దని వయసు 31 సంవత్సరాలు. ఇప్పుడు గుడ్లు పెట్టిన ఈ ఆడ కొండచిలువను ఒక వ్యక్తీ 1961 లో జూకి ఇచ్చాడు. ఈ కొండ చిలువ 1990 లో ఒకసారి, 2009లో ఒకసారి గుడ్లను పెట్టింది కానీ, అవి పిల్లలుగా మారలేదు. ఆ తరువాత ఆడ, మగ కొండచిలువలు రెండిటినీ వేరు వేరుగా జూలో ఉంచారు. ఈ జూలై 23 న జూ సిబ్బంది కొండచిలువ ఉన్న బోను శుభ్రం చేస్తున్న సమయంలో ఈ గుడ్లను చూసారు.