Viral Video: పాము, ముంగిస ఢీ అంటే ఢీ.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: నాగుపాము, ముంగిస ఈ రెండు ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-18 11:43 GMT

Viral Video: పాము, ముంగిస ఢీ అంటే ఢీ.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: నాగుపాము, ముంగిస ఈ రెండు ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకటితో మరొకటి ఢీ అండే ఢీ అన్నట్లు పోట్లాడుతుంటాయి. పాములు ఎక్కువగా ఉన్న చోట కచ్చితంగా ముంగిసలు ఉంటాయని చెబుతుంటారు. రెండింటి మధ్య జరిగే పోరులో ఏదో ఒకటి ప్రాణాలు కోల్పోయే వరకు పోట్లాడుకుంటూనే ఉంటాయి.

ఇక రెండింటి మధ్య జరిగే పోరును చూస్తుంటే ఒళ్లు జలదరించాల్సిందే. ఒకటికి మించి మరొకటి రెట్టించిన వేగంతో దాడి చేసుకుంటాయి. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలా పాము, ముంగిసల మధ్య జరిగే పోరుకు సంబంధించి వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పాము, ముంగిసలు ఏకంగా నడి రోడ్డుపై పోట్లాడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మహ్మదాబాద్-రోటిగూడు అనే రెండు గ్రామాల మధ్య నడి రోడ్డుపై నాగుపాము, ముంగిస రెండు తలపడ్డాయి. దీంతో రోడ్డుపై వెళ్లే ప్రజలంతా అక్కడే ఉండిపోయారు. వాహనాలను నిలిపివేసి భయంతో చూస్తుండిపోయారు. నాగుపాము పడగ విప్పి మరీ ముంగిసతో పోరుకు రెడీ అయ్యింది.

అయితే ముంగిస దాడికి పాము ఓడిపోవాల్సి వచ్చింది. పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ముంగిస మాత్రం అస్సలు వదిలి పెట్టలేదు. చివరికి నాగు పామును చంపేసి నోట కరుచుకొని చెట్లలోకి తీసుకెళ్లిపోయింది. దీంతో అక్కడున్న వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీనిని కెమెరాలో బంధించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Full View


Tags:    

Similar News