కొహ్లీ రికార్డ్‌పై కన్నేసిన రోహిత్‌

Update: 2019-02-05 11:50 GMT

న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా...కెప్టెన్ విరాట్ కొహ్లీ రికార్డును స్టాండిన్ కెప్టెన్ రోహిత్ శర్మ అధిగమించడానికి సిద్ధమవుతున్నాడు. టీ-20 ద్వైపాక్షిక సిరీస్ ల్లో టీమిండియాకు రోహిత్ శర్మ మూడోసారి నాయకత్వం వహించబోతున్నాడు. న్యూజిలాండ్ తో ముగిసిన పాంచ్ పటాకా వన్డే సిరీస్‌ను 4-1తో టీమిండియాకు అందించడం ద్వారా...విదేశీ గడ్డపై అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ విజయం అందించిన కెప్టెన్ గా నిలిచిన రోహిత్ శర్మ... కివీస్ తో బుధవారం ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ లో సైతం నాయకత్వం వహించబోతున్నాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యధిక విజయాల కెప్టెన్ గా విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న రికార్డును అధిగమించడానికి రోహిత్ తహతహలాడుతున్నాడు.

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ...రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కొహ్లీ సాధించిన విజయాలతో పోల్చి చూస్తే...స్టాప్ గ్యాప్ కెప్టెన్ రోహిత్ శర్మకే మెరుగైన రికార్డు ఉంది.తన కెరియర్ లో ఇప్పటి వరకూ 12 టీ-20 మ్యాచ్ ల్లో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ 11 విజయాలతో ఉన్నాడు. కెప్టెన్ గా ఒకే ఒక్క ఓటమిని చవిచూశాడు. కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి మాత్రం 20 టీ-20 ల్లో 12 విజయాలు, 7 పరాజయాల రికార్డు ఉంది. న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ నుంచి కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో...ఇప్పుడు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి పగ్గాలు అందాయి. కివీస్ తో జరిగే సిరీస్ లో టీమిండియా విజేతగా నిలిస్తే...కొహ్లీ కంటే రోహిత్ కే అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా నిలిచే అవకాశం ఉంది.

అయితే...టీ-20 ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్ ల్లో నాయకత్వం వహించడంతో పాటు...అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ రికార్డు మాత్రం...జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతోనే ఉంది. ధోనీ నాయకత్వంలో టీమిండియా 72 మ్యాచ్ ల్లో 41 విజయాలు సాధించింది. కెప్టెన్ గా కెప్టెన్ గా ధోనీ విజయ శాతం 59. 28 గా మాత్రమే ఉంది. టీ-20ల్లో కెప్టెన్ గా విరాట్ కొహ్లీ సక్సెస్ రేటు 63. 15 గా ఉంటే... రోహిత్ విజయశాతం 91.66 గా ఉంది. టీ-20 నాలుగో ర్యాంకర్ న్యూజిలాండ్ తో ఈనెల 6 నుంచి 10 వరకూ జరిగే తీన్మార్ సిరీస్ లో 3వ ర్యాంకర్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

సిరీస్ లోని తొలివన్డే...వెలింగ్టన్ వేదికగా 6న నిర్వహిస్తారు. రెండో వన్డే అక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 8న , సిరీస్ లోని ఆఖరి వన్డే హామిల్టన్ వేదికగా ఈనెల 10న నిర్వహిస్తారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా...న్యూజిలాండ్ స్వింగ్, సీమ్ పిచ్ లపై టీమిండియా...టీ-20 సిరీస్ లో ఏరేంజ్ లో రాణిస్తుందో వేచిచూడాల్సిందే.

Similar News