Late Marriage: వివాహం ఆలస్యమవుతుందా.. ఈ సమస్యల ప్రమాదం ఎక్కువ..!
Late Marriage: వివాహం ఆలస్యమవుతుందా.. ఈ సమస్యల ప్రమాదం ఎక్కువ..!
Late Marriage: నేటి రోజుల్లో చాలామంది ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. దీనికి కారణం కెరీర్‌ని సరిదిద్దుకోవడమే. అయితే పెళ్లి ఆలస్యం చేయడం వల్ల పుట్టే పిల్లలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు జన్యుపరమైన వ్యాధులని ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధులు ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తాయి. వీటికి చికిత్స చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వివాహం ఆలస్యం కావడం వల్ల పిల్లలు క్యాన్సర్, ఆటిజం, మానసిక అనారోగ్యంతో సహా అనేక జన్యుపరమైన వ్యాధులకి గురవుతున్నారు.
మన శరీరంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఇవి ఒక తరం నుంచి మరొక తరానికి లక్షణాలను, లోపాలను ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. క్రోమోజోమ్‌లో ఉండే DNA ద్వారా ఈ పని జరుగుతుంది. అందుకే తల్లిదండ్రుల నుంచి వ్యాధులు ఇతర అలవాట్లు పిల్లలకి వస్తాయి. పెరుగుతున్న వయస్సుతో పురుషుల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతోంది. ఇది పుట్టే పిల్లలను ప్రభావితం చేస్తుంది. దీంతో జన్యుపరమైన వ్యాధులు తలెత్తుతున్నాయి. వీటిలో బైపోలార్ డిజార్డర్, ఇన్ఫెర్టిలిటీ, క్యాన్సర్ వంటి మానసిక అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
ఆక్సీకరణ ఒత్తిడి వల్ల డీఎన్‌ఏ దెబ్బతింటుంది. యోగా చేయడం వల్ల డీఎన్‌ఏ డ్యామేజ్ నియంత్రించవచ్చు. దీని వల్ల తండ్రి నుంచి పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పురుషుల్లో ధూమపానం, మత్తు, మానసిక ఒత్తిడి కారణంగా వారి స్పెర్మ్ డీఎన్‌ఏ క్షీణిస్తోంది. దీని వల్ల పిల్లలు జన్యుపరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది పిల్లల్లో కంటి క్యాన్సర్‌కు కారణమవుతుంది. పురుషులు తమ జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజూ యోగా చేస్తూ ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. మద్యం తాగడం మానుకోవాలి. ధూమపానం చేయవద్దు. యోగాతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ఉత్తమం.