Realme 7, Realme 7 Pro: 64 ఎంపీ కెమెరా, ఫాస్ట్ చార్జీంగ్ వంటి అదిరే ప్యూచర్లతో రియల్ మీ బడ్జెట్ ఫోన్లు
Realme 7, Realme 7 Pro: డిజిటల్ ప్రపంచంలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తాజాగా అదిరే ప్యూచర్లతో మరో రెండు ఫోన్లను భారత మార్కెట్ లో విడుదల చేయనున్నది..
Realme 7, Realme 7 Pro: డిజిటల్ ప్రపంచంలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తాజాగా అదిరే ప్యూచర్లతో మరో రెండు ఫోన్లను భారత మార్కెట్ లో విడుదల చేయనున్నది.. ఈ ఫోన్లు ముఖ్యంగా ఫోటో ప్రేమికులను ఆకర్షించే విధంగా అది కూడా బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్లు కావడం విశేషం. అవే రియల్ మి 7 , రియల్ మి 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు. ఈ ఫోన్లను సెప్టెంబర్ 3వ తేదీన భారత్‌లో విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అదే రోజు రియల్.కామ్‌తో పాటు, ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఫోన్ అమ్మబడుతాయని సంస్థ పేర్కొంది. ఈ ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్, 30W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి అదిరే ఫీచర్లు ఈ ఫోన్ల సొంతం. అన్‌లైన్‌లో లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ల ప్రత్యేకతలు..
రియల్ మీ 7 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లే. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్ గానూ ఉండనుందని తెలుస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రధాన ఆకర్షణ కెమెరా.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్ ను అందించనున్నారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ వైట్ పొర్ ట్రెయిట్ సెన్సార్ లు కూడా ఇందులో ఉండనున్నాయి. ఇక సెల్ఫీ లవర్స్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరా ఉండనున్నట్టు తెలుస్తుంది.
ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ తో పాటు 30W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ మందం 0.94 గ్రాములుగానూ, ఫోన్ బరువు 196.5 గ్రాములుగానూ ఉండనుంది.
రియల్ మీ 7 ఫ్రో స్పెసిఫికేషన్లు
రియల్ మీ 7 ప్రోలో 6.67 అంగుళాల డిస్ ప్లే. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, అయితే రియల్ మీ 7 ప్రోలో 65W ఫాస్ట్ చార్జింగ్ ఉండనుంది. రియల్ మీ 7 ప్రోలో స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ తో రానున్నది.
అలాగే ఈ ఫోన్‌లో కంపెనీ 60z రిఫ్రెష్ రేట్‌తో సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను పొందవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. 64 ఎంపీ + 12 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ ప్రధాన కెమెరాగా రానున్నది. స్టోరేజ్ 64 జీబీ, ర్యామ్ 6 జీబీ వంటి ప్రత్యేకతలతో మార్కెట్‌లోకి రానున్నది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర సుమారు 20 వేల రూపాయలు ఉండనున్నట్టు తెలుస్తుంది.