వాటర్ ప్రూఫ్ రావణ @ విజయదశమి

Update: 2019-10-08 06:39 GMT

దసరా పండుగ చెడుపై మంచి సాధించిన గెలుపునకు గుర్తుగా చేసుకునే పండగ. చాలా ప్రాంతాల్లో ఈ పండుగ సందర్భంగా రావణాసుర దహనం చేస్తారు. దీనికోసం పెద్ద పెద్ద రావణాసుర బొమ్మల్ని చేసి దానికి పేలుడు పదార్థాలు అమర్చి దూరం నుంచి మండుతున్న బాణం రావనాసురిడిపై వేసి కలుస్తారు.

అయితే, ఇటీవల దేశమంతా భారీ వర్షాలు కురిసాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ  నేపధ్యంలో రావణాసుర దహనం కొంచెం కష్టమైనా పనిగా మారింది. అయితే, దీనికోసం మధ్యప్రదేశ్ లో ఒక కొత్త ఆలోచన చేశారు. అదే వాటర్ ప్రూఫ్ రావణాసురుడు.ఇండోర్ లోని జిమన్ బాగ్, రామ్ బాగ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రావణాసురుని వాటర్ ప్రూఫ్ గా మార్చేశారు. ఎంత వర్షం కురిసినా రావణుడు తడవకుండా రెయిన్ కోట్ వేసి అలంకరించారు.

దీంతో ఆ రావనాశురుని బొమ్మలు లేటెస్ట్ రావణాసురుడిగా మారిపోయాయి. ఈ ఏర్పాటు తో రావణాసురుడు ఆకర్షనీయంగా కూడా కనిపిస్తున్నాడు. దహన కార్యక్రమం వరకూ రావణుడు తడవకుండా ఉండేందుకు ఇటువంటి ఏర్పాట్లు చేశామని, ప్రతిమలకు రెయిన్ కోట్లు వేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇండోర్, ఉజ్జయిని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఈ రకమైన ఏర్పాట్లు చేశామనీ, వీటికి ప్రజలు బాగా స్పందిస్తునన్నరానీ వారు తెలిపారు.


Tags:    

Similar News