Raksha Bandhan 2023: రాఖీ ఏ సమయంలో కట్టాలి.. భద్ర కాలంలో ఎందుకు కట్టకూడదు.. కచ్చితమైన తేదీ, ముహూర్తం ఏదంటే?

Raksha Bandhan 2023 Date: హిందూ మతంలో రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగను అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు.

Update: 2023-08-29 04:30 GMT

Raksha Bandhan 2023: రాఖీ ఏ సమయంలో కట్టాలి.. భద్ర కాలంలో ఎందుకు కట్టకూడదు.. కచ్చితమైన తేదీ, ముహూర్తం ఏదంటే?

Raksha Bandhan 2023 Date: హిందూ మతంలో రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగను అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈ పండుగలో, సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి దీర్ఘాయువు, ఆనందం కోసం ప్రార్థిస్తారు. అదే సమయంలో సోదరికి బహుమతులు ఇచ్చే సమయంలో సోదరుడు ఎల్లప్పుడూ ఆమెను రక్షించడానికి ప్రతిజ్ఞ చేస్తుంటాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం, సోదర-సోదరీ ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి నాడు చేసుకుంటుంటారు. ఈసారి రాఖీ పండుగను ఆగస్టు 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించుకోవాలా.. లేదా 30వ తారీఖున లేదా 31న నిర్వహించుకోవాలనే ప్రశ్న వస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాఖీ పండుగను ఎల్లప్పుడూ భద్ర లేని కాలంలో జరుపుకుంటారు. మరి రాఖీని ఎప్పుడు కట్టాలి, రాఖీ పండుగ ఖచ్చితమైన తేదీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాఖీ పండుగ 2023లో భద్ర కాలంలో ఉంది.

పౌర్ణమి తిథి ఉన్న సమయంలో అంటే మధ్యాహ్నం జరుపుకోవడం శ్రేయస్కరం. అయితే రాఖీ పండుగ రోజున భద్ర కాలం ఉండకూడదనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రాఖీ పండుగ రోజున భద్రుని నీడ ఉంటే సోదరుని మణికట్టుకు రాఖీ కట్టకూడదనే విషయం గుర్తుంచుకోవాలి.

భద్రకాళ పౌర్ణమి తిథితో ప్రారంభం కానుంది. ఆగష్టు 30వ తేదీ రాత్రి 09.02 నిమిషాల వరకు భద్ర కాలం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, రాఖీ పండుగను భద్రకాల సమయంలో చేసుకోకూడదు. భద్ర లేని కాలంలో మాత్రమే రాఖీ కట్టడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణిస్తుంటారు. మరోవైపు, శ్రావణ పూర్ణిమ తేదీన రాఖీ కట్టడానికి మధ్యాహ్నం సమయం అత్యంత అనుకూలమైన సమయం. అయితే ఈ ఏడాది ఆగస్ట్ 30 నుంచి రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ ప్రారంభం కావడంతో రోజంతా భద్ర నీడ ఉంటుంది. ఈ విధంగా ఆగస్ట్ 30న పగటిపూట రక్షాబంధన్ కు ఎలాంటి శుభ ముహూర్తాలు ఉండవు. ఆగష్టు 30వ తేదీ 09.02 నిమిషాల వరకు భద్ర కాలం ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఆగస్టు 30న రాత్రి 09.02 నిమిషాల తర్వాత రాఖీ కట్టవచ్చు.

హిందూ పంచాంగం ప్రకారం, ఆగష్టు 31 న, శ్రావణ పూర్ణిమ తేదీ 07.05 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో భద్ర కాలం ఉండదు. అందుకే ఆగస్టు 31న తెల్లవారుజామున రాఖీ కట్టడం శుభప్రదం.

రాఖీ పండుగ శుభ సమయం..

రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ తేదీ:30 ఆగస్టు 2023

రాఖీ కట్టే సమయం: 30 ఆగస్టు 2023 రాత్రి 09.03 నిమిషాల తర్వాత నుంచి మొదలవుతుంది.

రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ తేదీ ముగింపు- 31 ఆగస్టు ఉదయం 07: 05 నిమిషాల వరకు ఉంటుంది.

Tags:    

Similar News