Raksha bandhan special songs in tollywood: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి వెండితెర స్వరాలు!
Raksha bandhan special songs in tollywood: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి రాఖీ ఒక వేడుక అయితే, సినిమాల్లో ఈ బంధానికి ఎంతో ప్రత్యేకత ఉంటూ వస్తోంది.
Raksha bandhan special songs in tollywood: అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా జరుపుకునే పండుగను రాఖీ అని అంటారు. దీనినే రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అంటారు.. మరికొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం అనే అర్ధం. ఇది అన్నా చెల్లెల్లు,అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది అందరూ చాలా ఉత్సాహంతో జరుపుకుంటూరు. ఈ రాఖీ పండగ విశిష్టతను తెలియజేస్తూ టాలీవుడ్లో కొన్ని పాటలు వచ్చాయి అవేంటో ఒక్కసారి చూద్దాం!
1. అందాల చిన్ని దేవత : శివరామరాజు
జగపతిబబాబు మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ సినిమా 2002లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ముగ్గురు అన్నదమ్ములు, చెల్లలు మధ్య వచ్చే "అందాల చిన్ని దేవత " అనే పాట వారి అనుబంధాన్ని అర్ధంపడుతుంది. ఈ పాటను శంకర్ మాహదేవన్, సుజాత కలిసి ఆలపించారు.
2. అన్నయ్య అన్నావంటే : అన్నవరం
పవన్ కళ్యాణ్ , భీమినేని శ్రీనివాస్ రావు కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అన్నవరం.. ఇందులో చెల్లలు కోసం ఎప్పుడు తపించే అన్నయ్య పాత్రలో పవన్ కళ్యాణ్ బాగా నటించాడు. ఇక సినిమాలో భాగంగా వచ్చే "అన్నయ్య అన్నావంటే ఎదురవనా... అలుపై ఉన్నావంటే నిదరవనా" అంటూ చెల్లి కోసం అన్నయ్య పాడే ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సింగర్ మనో ఈ పాటను ఆలపించారు.
3. అన్నా చెల్లెలి అనుబంధం : గోరింటాకు
హీరో రాజశేఖర్ , మీరా జాస్మిన్ అన్నాచెల్లులుగా నటించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక సినిమాలో భాగంగా వచ్చే "అన్నా చెల్లెలి అనుబంధం .. జన్మ జన్మలా సంబంధం" అనే సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇక సినిమా చివర్లో చెల్లెలు చనిపోయిన సంగతి తెలుసుకొని అన్నయ్య కూడా చనిపోవడం అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇక ఈ పాటను ఎస్పీ బాలు, చిత్ర కలిసి ఆలపించారు.
4. సీతాకోక చెల్లి : పుట్టింటికి రా చెల్లి
కోడి రామకృష్ణ దర్శకత్వంలో, అర్జున్ హీరోగా వచ్చింది ఈ చిత్రం.. ఇందులో అర్జున్ చెల్లిగా మధుమిత నటించింది. చెల్లి సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక అన్న చెల్లిల మధ్యలో వచ్చే సన్నివేశాలు మాత్రమే కాదు. పాటలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చెల్లలు సీమంతం అప్పుడు అన్నయ్య పాడే ఈ పాట చెల్లెలుపై అతనికి ఉన్న ప్రేమను అద్దం పడుతుంది.
5. సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు : గణేష్
వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలోని 'సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు" అనే పాట తన చెల్లలి పైన ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఇప్పటికి ఈ పాట ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.
6. విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి : బంగారు చెల్లెలు
1979లో విడుదలైన ఈ చిత్రం అన్నాచెల్లెళ్ళ మధ్య అనుబంధానికి చాటిచెప్పింది. ఇందులో శోభన్ బాబు శ్రీదేవి అన్నాచెల్లెళ్ళగా నటించారు. జయసుధ శోభన్ బాబుకు జంటగా నటించింది. ఈ సినిమాలోని విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి అంటూ వచ్చే ఈ పాట వారి మధ్య ఉన్న ఆప్యాయతను తెలియజేస్తుంది. ఈ పాటను ఆచార్య ఆత్రేయ రాయగా, ఎస్పీ బాలు ఆలపించారు.