లాక్ డౌన్ లో ప్రజల ఓవర్ యాక్షన్.. పోలీసుల స్మార్ట్ రియాక్షన్!
మనలో చాలా మందికి ఓ వింత అలవాటు ఉంటుంది. చెబితే వినం.. తిడితే ఏడుస్తాం.. కొడితే ఇంక ప్రపంచం ఎకమైపోయేలా గగ్గోలు పెట్టేస్తాం. ఇక ప్రమాదం అని చెప్పినా చాలా మందికి అది ఎలా ఉంటుందో చూడాలని మహా ఉబలాటంగా ఉంటుంది.
మనలో చాలా మందికి ఓ వింత అలవాటు ఉంటుంది. చెబితే వినం.. తిడితే ఏడుస్తాం.. కొడితే ఇంక ప్రపంచం ఎకమైపోయేలా గగ్గోలు పెట్టేస్తాం. ఇక ప్రమాదం అని చెప్పినా చాలా మందికి అది ఎలా ఉంటుందో చూడాలని మహా ఉబలాటంగా ఉంటుంది.దాంతో..లోపల భయం ఉన్నా దానిగురించి తెలుసుకోవాలని పరుగులు తీస్తారు. ఇంకా చెప్పాలంటే చావు భయం కలవరపెడుతున్నా జాగ్రత్తలు చెప్పేవారిని చికాకుగా చూసి.. తామేం చేయాలో అది చేస్తారు. అందుకే ప్రభుత్వాలు ఒక్కోసారి కొరడా తీస్తాయి. హక్కులు.. మానవత్వం అని లేక్కలేస్తే ప్రమాదం జరిగిన తరువాత లెక్కలు చెప్పడానికి కూడా ఒక్కరూ మిగలరు. ఇప్పుడిదంతా ఎందుకంటే..
కరోనా భూతం మెల్లమెల్లగా ప్రపంచాన్ని ఆవరించి చీకట్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. దానిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు పడరాని పాట్లు పడుతున్నాయి. తమ ఎజెండాలు అన్నీ పక్కన పెట్టి మరీ కరోనా పై యుద్ధం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అధికారులు కరోనాను ఎదుర్కోవడం కోసం ప్రజలకు నిబంధనలు ఊదర గొట్టేలా చెబుతున్నాయి. ఈ యుద్దంలో ప్రజలంతా సైనికులే బాబూ.. మా ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తే మనం గెలిచి తీరతాం అని చెబుతున్నారు. దానికోసం మీరేమీ చ చేయొద్దు. జస్ట్ ఇంట్లో కూర్చోండి. మిగతా పని మేం చూస్తాం అని భరోసా ఇస్తున్నారు. అయితే, అంత త్వరగా ఆమాట వింటే ఇంకేమి. రోడ్ల మీద యధేచ్చగా తిరిగేస్తున్నారు. అధికారులు ఆపితే, వడియాలు.. వొళ్ళునోప్పులు అంతో సోది చెప్పి తప్పించుకుంటున్నారు.
ఇక కరోనా పరిస్థితి మరింత విషమించడంతో ప్రభుత్వాలు గట్టి ఆదేశాలు ఇచ్చాయి. ఇల్లు కదిలి ఎవరైనా కనిపిస్తే కఠినంగా వ్యవహరించమని చెప్పాయి. అయినా ఈ బాబులు మాట వినడం లేదు. మహా అయితే ఫైన్ వేస్తారు.. ఇంకా అంటే కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ ఏమవుతుంది లే.. వీలైనంత వరకూ తప్పించుకు తిరగుదాం.. దొరికిపోతే కాళ్ళో వేళ్ళో పట్టుకుందాం అని రోడ్లేక్కుతూనే ఉన్నారు. సరిగ్గా విజయవాడలో లాంటి పనే చేశాడు ఓ యువకుడు. తప్పించుకోలేక పోలీసులకు దొరికాడు. ఇంకేముంది బతిమాలాడు. పోలీసులు వినలేదు. సర్లే కొద్దిసేపు నిలబెట్టి పదో పరకో చలానా రాసేస్తారు కట్టేసి పోదాం అనుకున్నాడు. అయితే, ఆ పోలీసాయన ఒక కాగితం పెన్ను ఇచ్చాడు. ఇదెందుకు సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే.. జస్ట్ ఓ 500 సార్లు ఈ కాగితం మీద ''తప్పైపోయింది.. క్షమించండి" అని రాసి ఇచ్చి వెళ్ళిపో అన్నారు.
అంతే అవాక్కయిన ఆయువకుడు ఏం చేయాలో తెలీక పోలీసాయన కాళ్ళ మీద పడినంత పని చేశాడు. ఏది ఏమైనా పోలీసులకు లాఠీలను ఝులిపించడమే కాదు.. విచిత్రమైన పనిష్మెంట్లు ఇచ్చి కూడా లెక్కలు సరిచేయగలమని నిరూపించారు. అయ్యా.. బాబూ మీ మంచి కోసమే పోలీసులు.. డాక్టర్లూ.. వైద్య సిబ్బంది.. పారిశుద్ధ్య సిబ్బందీ ప్రాణాలు పణంగా పెట్టి రోడ్లమీద తిరుగుతున్నారు. మీరేమో వారిని ఎగతాళి చేసేలా రోడ్లేక్కి గంతులేస్తున్నారు. కొద్దిగా ఆలోచించండి!