Optical Illusion: మీరు ఎలాంటి వారో తెలుసా.? ఈ ఫొటోలో ముందుగా ఏం కనిపిస్తోందో చెప్పండి..!
Optical Illusion: మనం ఎలా ఆలోచిస్తామో తెలియాలంటే మనతో మాట్లాడాలి. మనతో స్నేహం చేయాలి.
Optical Illusion: మనం ఎలా ఆలోచిస్తామో తెలియాలంటే మనతో మాట్లాడాలి. మనతో స్నేహం చేయాలి. అలాకాకుండా మనం చూసే విధానం బట్టి మనం ఎలాంటి వాళ్లం, మన ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పొచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. ఒక ఫొటోను లేదా దృశ్యాన్ని మనం ఏ కోణంలో చూస్తామన్నదానిపై మనం ఎలాంటి వాళ్లమో చెప్పొచ్చు. వీటినే పర్సనాలిటీ టెస్ట్‌గా చెబుతుంటారు. అలాంటి ఓ ఫొటో గురించి ఇప్పుడు చూద్దాం.
పైన కనిపిస్తున్న ఫొటోలో మొత్తం నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. వీటిలో ఒకటి చెట్టు, చింపాజీ, సింహంతో పాటు చేపపిల్లలు ఉన్నాయి. వీటిలో మీకు మొదట ఏం కనిపిస్తుందన్నదాని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇతకీ ఏది మొదటి కనిపిస్తే ఎలాంటి వాళ్లమో ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టు కనిపిస్తే..
ఒకవేళ మీకు మొదట చెట్టు కనిపిస్తే మీ ఆలోచనలు లాజికల్‌గా ఉంటాయని అర్థం. మీరు త్వరగా మీ నిర్ణయాలను మార్చుకుంటారు. మీ భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తపరచలేరు. అంత సులువుగా ఇతరులను నమ్మరు.
గొరిల్లా కనిపిస్తే..
మీకు ఈ ఫొటో చూడగానే ఒకవేళ తొలుత గొరిల్లా కనిపిస్తే.. మీరు ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఉన్న ప్రమాణాలకు కట్టుబడి ఉన్నారని అర్థం. మీలో నేర్చుకోవాలనే కోరిక బాగా ఉంటుంది. అయితే మీకే తెలుసుకున్న అహంకారం కూడా ఉంటుంది.
సింహం కనిస్తే..
కుడివైపు ఉన్న సింహం కనిపిస్తే మీరు థ్రిల్లింగ్‌ను కోరుకుంటారని అర్థం. మీ నిర్లక్ష్యం కారణంగా ఇతరులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అర్థం చేసుకోవాలి.
చేపలు కనిపిస్తే..
ఒకవేళ మీకు మొదటగా చేపలు కనిపిస్తే.. మీ సూక్ష్మ దృష్టికలవారని అర్థం చేసుకోవాలి. ప్రతీ చిన్న విషయాన్ని పట్టి పట్టిమరీ చూస్తారు. తప్పులు లేకుండా పనులు చేయాలని ఆశిస్తుంటారు. ఇతరుల పట్ట దయతో ఉంటారు. పక్కవారికి సాయం చేయాలనే నేచర్ మీలో ఎక్కువగా ఉంటుంది.