Optical Illusion: ఈ ఫొటోలో జిరాఫీ పదం కూడా దాగి ఉంది.. ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion: చూసే కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు ఉండే క్రేజే వారు.
Optical Illusion: చూసే కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు ఉండే క్రేజే వారు. ఒకప్పుడు మ్యాగజైన్స్‌కు, న్యూస్ పేపర్లకే పరిమితమైన ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు.. సోషల్ మీడియా రాకతో అందరికీ చేరువయ్యాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సైట్స్‌లో వీటి కోసం ప్రత్యేకంగా పేజీలను క్రియేట్ చేసి మరీ ఇలాంటి ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీటికి పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతున్నారు.
ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో రకరకాలు ఉంటాయి. వీటిలో కొన్ని నెంబర్లకు సంబంధించినవి అయితే మరికొన్ని ఫొటో పజిల్స్. ఈ ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేయాలంటే మీ ఆలోచన శక్తితో పాటు, మీ ఐ పవర్ కూడా షార్ప్‌గా ఉండాలి. అలా అయితేనే వాటిని సాల్వ్ చేయగలరు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి ఓ ఫొటేనే తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫోటో అందులో ఉన్న మ్యాటర్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే సహజంగానే ఒక జిరాఫీ కనిపిస్తోంది. కదూ అయితే ఇదే ఫొటోలో జిరాఫీ అనే పదం కూడా ఉంది. దాన్ని కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ముఖ్య ఉద్దేశం. మరి మీరు దీన్ని కనిపెట్టారా.? జిరాఫీ అనే ఇంగ్లిష్ పదం ఇదే ఫొటలో దాగి ఉంది. దాన్ని కేవలం 10 సెకండ్లలో కనిపెడితే మీ ఐపవర్ అద్భుతంగా ఉందని అర్థం చేసుకోవాలి. మరెందుకు ఆలస్యం మీ బుర్రకు పనిచెప్పండి. ఆ పదాన్ని కనిపెట్టండి. ఏంటి ఎంత ప్రయత్నించినా సమాధానం దొరకడం లేదా. అయితే ఓసారి జిరాఫీ మెడపై గమనించండి. 'GIRAFE' అనే పదం స్పష్టంగా కనినిస్తుంది. ఇంత క్లూ ఇచ్చినా కనిపెట్టలేకపోతే ఓసారి సమాధానం కోసం కింద ఫొటో చూడండి.