National Friendship Day 2020 : స్నేహం ఓ వరం..!
National Friendship Day 2020 : స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది.
National Friendship Day 2020 : స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'. హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదయంలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది...ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతోంది.. కాలాలకతీతంగా మైత్రి మధురిమను పెంచుతోంది...కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు.
స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. 'స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. 'జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది'. స్నేహం ఎంతో తియ్యనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.
ఇలాంటి స్నేహితుల కోసం ఓ రోజు ఉంది. అదే స్నేహితుల దినోత్సవం. ఇంతటి గొప్ప స్నేహితుల దినోత్సవాన్ని మన భారత దేశంలో ప్రతి ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున 'ఫ్రెండ్‌షిప్ డే ' ను ఘనంగా నిర్వహించుకుంటారు.
స్నేహితుల దినోత్సవం ఏ దేశంలో ఎప్పుడు జరుపుకుంటారు..
నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్ వ్యూహాలతో మొదలైంది. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అంతే కాదు హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్ హాల్ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. అందుకు తగ్గట్లు కొన్ని గ్రీటింగ్ కార్డులు మార్కెట్లోకి పంపారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. 1997 లో యునైటెడ్ నేషన్స్ "స్నేహం" యొక్క ప్రపంచ అంబాసిడర్ "విన్నీ ది పూః". నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి.
ఇక వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ అనే సంస్థ 1958లో పరాగ్వేలో జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు కూడా దీన్ని పాటించడం మొదలుపెట్టాయి. 2011లో ఐక్యరాజ్యసమితి కూడా ఈ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20వ తేదీన నిర్వహిస్తారు. అయితే భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. పాకిస్థాన్‌లో మాత్రం జూలై 30వ తేదీన చేసుకుంటారు. ఇంగ్లీష్ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన 'విన్నీ ది పూహ్' కార్టూన్ క్యారెక్టర్ టెడ్డీబేర్‌ను స్నేహానికి ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ భార్య నానె అన్నన్ 1998లో ప్రకటించారు. అమెరికా ప్రపంచ ఫ్రెండ్షిప్ డే మసాచుసెట్స్, ఓహియో,, అప్పుడప్పుడు న్యూ హాంప్షైర్ యొక్క పాకెట్స్ యునైటెడ్ స్టేట్స్ లో జూన్ 30 న ఒక జరుపుకుంటారు. బ్రెజిల్ బ్రెజిల్ స్నేహితుల దినోత్సవాన్ని ఏప్రిల్ 18 న జరుపుకుంటారు.