అమ్మకు వందనం!
అమ్మ.. నిర్వచనానికి అందని పదం. వేలకోట్ల భావాలకు ప్రతిరూపం. జీవాన్ని, జీవితాన్ని ఇవ్వడమే కాదు..జీవితకాలపు ప్రేమైక మమకారాన్ని పంచడంలో తల్లిని మించి ఎవరూ వుండరు.
అమ్మ.. నిర్వచనానికి అందని పదం. వేలకోట్ల భావాలకు ప్రతిరూపం. జీవాన్ని, జీవితాన్ని ఇవ్వడమే కాదు..జీవితకాలపు ప్రేమైక మమకారాన్ని పంచడంలో తల్లిని మించి ఎవరూ వుండరు.
అమ్మ అనే పలుకు తీయదనం
అమ్మ అనే భావన ఇచ్చే భరోసా
ప్రపంచంలో మరేశక్తీ ఇవ్వదు. ఇవ్వలేదు.
కష్టాలకొలిమిలో కాలిపోతూ కూడా సుఖాల పొత్తిలిలో హత్తకుని రక్షించేది తల్లి మాత్రమే.
జీవనసుడిగుండంలో చిక్కుకున్నా.. తన కొంగుచాటున బిడ్డల్ని నిలిుపి వారి భవిష్యత్తు కోసం తపించేది మాతృమూర్తి మాత్రమే.
బిడ్డ ఆకలి తీర్చడానికి తన రక్తాన్ని స్తన్యంగా అందించి.. ఆనందించే దైవ రూపం.
అయితే, కంటేనే తల్లి అని అనుకోవడానికి లేని అనేక సంఘటనలు నిత్యం మనం చూస్తుంటాం.
తనకు సంబంధంలేని వ్యక్తి ఆకలిని తీర్చడానికిీ తను తినకుండా కూడా అహారాన్ని ఇచ్చే తల్లులు ఎందరో.
కటిక పేదరికంలోనూ కూలి పనితో బిడ్ఢల కడుపునింపే అమ్మలెందరో..
తన ఆరోగ్యం కుంటుపడినా.. పిల్లల ఆరోగ్యం కోసం పరితపించే మాతృమూర్తులకు లెక్కేలేదు..
కొలవలేనిది..తరిగిపోనిది.. రుణం తీర్చుకోలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే!
అమ్మ కోసం జీవితాన్ని ఆమె పాదాల ముందు పరచినా సరిపోదు. కానీ, అమ్మకు ఒక కృతజ్ఞత.. తల్లి త్యాగానికి ఓ వందనం.. అన్నిటికీ మించి తరగని అమ్మ ప్రేమ గుర్తులు నిండిన హృదయంతో ఓ మాతృమూర్తి..నీకిదే నమస్సుమాంజలి అంటూ ప్రపంచం అంజలి ఘటించే మదర్స్ డే సందర్భంగా అమ్మకు వందనం సవినయంగా సమర్పిస్తోంది హెచ్ఎంటీవీ లైవ్!